twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి‌’ టీషర్ట్ మీద రాసింది నిజమేనా? అంతటా ఇదే చర్చ

    ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రాలకు లక్ష మంది పనిచేసారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' శుక్రవారంతో షూటింగ్ పూర్తి చేసుకొంది.సుదీర్ఘంగా సాగిన బాహుబలి సినీ తపస్సుకి గుమ్మడికాయ కొట్టేశారు. అలాగే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకి జవాబు దొరికే రోజుని మరింత చేరువ చేసేశారు.

    మూడున్నరేళ్లుగా మరో సినిమా ఆలోచనే లేకుండా కేవలం 'బాహుబలి'తోనే ప్రయాణం చేసిన హీరో ప్రభాస్‌కి కూడా శుక్రవారమే ఆఖరి షూటింగ్ రోజు. ఆ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 'బాహుబలి: ది బిగినింగ్‌', 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' చిత్రాల్ని ఒక తపస్సులా భావించి 613 రోజులపాటు చిత్రీకరణ జరిపారు. సినిమాలో కనిపించిన ఇతరత్రా తారలంతా వేరే చిత్రాల్లో నటించినప్పటికీ ప్రభాస్‌ మాత్రం 'బాహుబలి' వరుస చిత్రాల కోసమే పనిచేశారు.

    2013 జులై 6న మొదలైన ఈ చిత్ర షూటింగు 2017 జనవరి 6న తెరపడింది. ఈ నేపథ్యంలో రాజమౌళి సహా అందరూ ఎమోషన్స్ లోనయ్యారు. మొత్తం యూనిట్ మొత్తాన్ని ఒకచోటికి చేర్చి ఫొటోలు.. వీడియోలు దిగారు. అందులో కొన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకున్నారు. చివరి రోజు 'బాహుబలి' టీం సభ్యులందరూ స్పెషల్ టీషర్టులు ధరించడం విశేషం. ఆ టీషర్టుల మీద ముద్రించిన విషయాలు ఆసక్తి రేకెత్తిస్తూ అంతటా హాట్ టాపిక్ గా మారాయి.

    Prabhas' Journey Comes To End, Lays Down Sword After 613 Days Of Shoot

    'బాహుబలి' షూటింగ్ మొత్తం 613 రోజులు జరిగినట్లుగా ఇందులో పేర్కొన్నారు. అలాగే ఈ టీషర్ట్ మీద ముద్రించిన విషయంలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది ఈ సినిమాకు లక్ష మంది క్రూ పని చేశారనడమే. యుద్ధ సన్నివేశాల్లో పాల్గొన్న వేలాది మంది జూనియర్ ఆర్టిస్టుల్ని కలుపుకున్నా లక్ష మంది ఈ సినిమాకు పని చేశారంటే ఆశ్చర్యం కలిగించే విషయమే అంటున్నారు.

    చివరి రోజు సెట్లో ఉన్న అందరూ ఈ టీషర్టులు ధరించి ఒక చోటికి చేరగా.. అందరూ చప్పట్లు చరుస్తుండగా.. ప్రభాస్ జై మహిష్మతి అని నినాదాలు చేస్తుండగా 'బాహుబలి' షూటింగ్కి ముగింపు పలికింది రాజమౌళి యూనిట్.

    ఆ విషయాన్ని గుర్తు చేసుకొంటూ ''ఈ సినిమాని ప్రభాస్‌ నమ్మినంతగా మరెవ్వరూ నమ్మలేదు. అందుకు డార్లింగ్‌కి కృతజ్ఞతలు'' అని ట్వీట్‌ చేశారు రాజమౌళి.

    Prabhas' Journey Comes To End, Lays Down Sword After 613 Days Of Shoot

    చిత్రీకరణ చివరి రోజు కావడంతో శుక్రవారం ప్రభాస్‌ సెట్‌లో సందడిగా గడిపారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థ నిర్మిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకొస్తుంది. మూడున్నరేళ్ల కిందట మొదలైన 'బాహుబలి' షూటింగ్ ఎట్టకేలకు ముగిసింది.

    ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం థియేట్రికల్‌, శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తంలోఇప్పటికే అమ్ముడు పోయాయి.

    English summary
    Emotions are running high among the Tollywood fans as the Baahubali has finally has laid down his sword and shield, calling it a wrap on Friday. Prabhas has just finished his part for the role after shooting for 613 days for Baahubali: The Conclusion. He left his fans and the film team teary-eyed, who took on to Twitter to share their feelings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X