»   » వీడియో: ప్రభాస్ మహేంద్ర యాడ్

వీడియో: ప్రభాస్ మహేంద్ర యాడ్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలితో ఓ రేంజిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్ మహేంద్రవారి TUV300 కు నేషనల్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభాస్ తో యాడ్ ని షూట్ చేసారు. ఈ యాడ్ ని ఇప్పుడు రిలీజ్ చేసారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

ఈ యాడ్ లో కేవలం ప్రభాస్ వచ్చి ఈ వెహికల్ గురించి చెప్పటమే కాదు కొన్ని ఊపిరిబిగపట్టే సాహసమైన స్టంట్స్ చేసారు. ఈ స్టంట్స్ ని బాలీవుడ్ పాపులర్ యాక్షన్ డైరక్టర్ పర్వీజ్ షేక్ అందించారు. మహేంద్ర మేనేజ్మెంట్ ఈ యాడ్ ని లావిష్ గా భారీ బడ్జెట్ తో తీసారు. ఈ విజువల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టన్ చేస్తున్నాయి.

బాహుబలి విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ, ఫ్రెంచి భాషల్లో ఈ సినిమా జులై 10న ప్రేక్షకులను పలకరించింది. విడుదలైంది మొదలు బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తూ భారత చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంది. విడుదలైన మొదటి రోజే 68 కోట్లను వసూలు చేసింది.

prabhas add

భారత్‌లో అన్ని భాషలను కలుపుకొని మొదటి వారం 178 కోట్లను, ప్రపంచవ్యాప్తంగా 255 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మొదటి వీకెండ్‌లో 162 కోట్లను రాబట్టిందీ చిత్రం. 9 రోజుల్లోనే 300 కోట్లను రాబట్టి ఆ క్లబ్‌లో చేరిన మొదటి దక్షిణాది చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 401 కోట్లను 15 రోజుల్లోనే రాబట్టింది. తదనంతరం 500 కోట్ల క్లబ్‌లో చేరింది.

ఈ క్రమంలో హిందీ వర్షెన్‌లో 100 కోట్లకు పైగా వసూలు చేసి ఆ ఘనత సాధించిన మొదటి డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. భారత్‌లో అత్యధిక వసూళ్ళను రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది బాహుబలి. ఇప్పటి వరకు 600.95 కోట్లను బాహుబలి వసూలు చేసినట్లు ఓ అంచనా.

English summary
Prabhas Latest Mahindra TUV300 Ad released.
Please Wait while comments are loading...