twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదో క్రియేటివిటీ: ‘బాహుబలి’ ట్రైలర్ లో రామ్ చరణ్ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి' సినిమా జూలై 10న భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం గురించి ఆసక్తి అంతటా మొదలైంది. మరో ప్రక్క ఈ చిత్రం పై అనేక స్ఫూఫ్ లు, ప్యారెడీ వీడియోలు వస్తున్నాయి. కొందరు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలతో కలిపి వెర్షన్స్ ని విడుదల చేస్తున్నారు. అలా ..ఇప్పుడు రామ్ చరణ్ ని, బాహుబలి ట్రైలర్ ని కలిపి ఈ ట్రైలర్ ని వదిలారు. ఫ్యాన్ మేడ్ గా తయారైన ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో మంచి ఆదరణ పొందుతోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    'బాహుబలి' ఆడియో వేడుక మొన్న తిరుపతిలో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అదే స్పీడులో తమ సినిమాపై జోకులేసుకొంది 'బాహుబలి' టీమ్‌. ఆ జోక్స్ ని అందరూ ఎంజాయ్ చేసారు. తెగ నవ్వుకున్నారు. ఇలా ఆడియో ఫంక్షన్ లో జోక్స్ వేయటం గొప్ప విషయమే.

    'బొమ్మరిల్లు'లో'అంతా మీరే చేశారు నాన్నా..' సీన్‌నీ స్ఫూఫ్‌గా మార్చుకొన్నారు. ఈ సన్నివేశంలో ప్రకాష్‌రాజ్‌ రాజమౌళి అన్నమాట. సిద్ధార్థ్‌.. ప్రభాస్‌కి అభిమాని. 'ఇప్పటికీ మీరు 'బాహుబలి' రిలీజ్‌ డేట్‌ చెప్పలేదు సార్‌...' అంటూ రాజమౌళిని ప్రభాస్‌ ఫ్యాన్‌ నిలదీయడంతో.. రాజమౌళితో సహా.. అక్కడున్నవాళ్లంతా హాయిగా నవ్వేశారు.

    Prabhas&Ramcharan in Baahubali Trailer

    'కిక్‌' సినిమాలో ఓ సన్నివేశాన్ని 'బాహుబలి' టీమ్‌ సరదాగా వాడుకొంటూ నవ్వులు పూయించింది. రాజమౌళి ఫొటో చూసిస్తూ 'ఐ యామ్‌ లి.. రాజమౌళి. బాహుబలిని ఎప్పుడు రిలీజ్‌ చేస్తానో నాకే తెలీదు..' అంటూ నవ్వించారు. అలాగే... 'అవతార్‌'లోని సన్నివేశాలకు 'బాహుబలి' ప్రచార చిత్రంలోని సంభాషణలను జతచేసి చూపించిన ట్రైలర్‌ ఆకట్టుకొంది.

    దీనితో పాటు..

    'బాహుబలి' మొదలయ్యాక మూడు ఐపీఎల్‌లు జరిగాయి, ఓ వరల్డ్‌కప్‌ సిరీస్‌ పూర్తయ్యింది, 'బాహుబలి'తో పాటు మొదలైన హైదరాబాద్‌లోని మెట్రో ప్రాజెక్టు కూడా పూర్తికావొచ్చింది కానీ 'బాహుబలి' పూర్తికాలేదంటూ.. సెటైర్లు వేసుకొన్నారు.

    ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

    ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.

    భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    Baahubali is an upcoming two part Indian film, written and directed by S. S. Rajamouli. Produced by Shobu Yarlagadda and Prasad Devineni, the film is simultaneously being made in Telugu and Tamil languages. There will be dubbed versions in Hindi and Malayalam. Baahubali features an ensemble cast of Prabhas Raju, Rana Daggubati, Anushka Shetty and Tamannaah in the lead roles, and Ramya Krishnan, Sathyaraj, Nassar, Adivi Sesh, Tanikella Bharani and Sudeep in crucial roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X