twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనీ మైండెడ్ కాదు: ప్రభాస్ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో తెలుసా?

    ఇటీవల హిందుస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తనకు డబ్బు కంటే ఫ్యామిలీ, ఫ్రెండ్సే ముఖ్యమని ప్రభాస్ చెప్పకనే చెప్పాడు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాహుబలి', 'బాహుబలి-2' సినిమాల తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. సౌత్ స్టార్ల గురించి పెద్దగా పట్టించుకోని జాతీయ మీడియా 'బాహుబలి' బాక్సాఫీసు దెబ్బతో తన తీరు మార్చుకున్నట్లే కనిపిస్తోంది.

    బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్, రాజమౌళి తదితరుల ఇంటర్వ్యూల కోసం జాతీయ మీడియా పోటీ పడుతుండటం గమనార్హం. కాగా... ఇటీవల హిందుస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తనకు డబ్బు కంటే ఫ్యామిలీ, ఫ్రెండ్సే ముఖ్యమని ప్రభాస్ చెప్పకనే చెప్పాడు.

    ప్రభాస్ తీరు చూసి ఆశ్చర్యం

    ప్రభాస్ తీరు చూసి ఆశ్చర్యం

    బాహుబలి తర్వాత ప్రభాస్ కు బాలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. భారీగా రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు పలువురు నిర్మాతలు. అయితే ప్రభాస్ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు.

    బాలీవుడ్ అవకాశాలు ఎందుకు ఒప్పుకోవడం లేదంటే...

    బాలీవుడ్ అవకాశాలు ఎందుకు ఒప్పుకోవడం లేదంటే...

    బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నా ఇంకా అంగీకరించక పోవడంపై ప్రభాస్ స్పందిస్తూ... ప్రస్తుతం నా మొదటి ప్రాధాన్యత వీలైనంత ఎక్కువ సమయం నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో గడపటమే. ఇంకా సాహో లోని క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా బాలీవుడ్లోకి రావాలనే విషయం గురించి ఏమీ ఆలోచించలేదన్నారు.

    అదే నాకు పెద్ద కాంప్లిమెంట్

    అదే నాకు పెద్ద కాంప్లిమెంట్

    రాజమౌళి సార్ నా కోసం బాహుబలి క్యారెక్టర్ రాయడమే పెద్ద కాంప్లిమెంట్. సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు అసలు ఈ క్యారెక్టర్ చేయడానికి నేను అర్హుడినా? నాకు అంత స్టేచర్ ఉందా? అని ఆలోచించే వాడిని...... అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

    మొదట రెండు సంవత్సరాలే అనుకున్నాం

    మొదట రెండు సంవత్సరాలే అనుకున్నాం

    బాహుబలి సినిమా ప్రాజెక్టుకు ముందు రెండు సంవత్సరాలు మాత్రమే అనుకున్నాం. కానీ తర్వాత సమయం పెరుగుతూ వచ్చింది. రాజమౌళి మీద నమ్మకంతో ఎలాంటి టెన్షన్ లేకుండా షూటింగులో నిమగ్నమయ్యాను అని ప్రభాస్ తెలిపారు.

    బాహుబలి సమయంలో ఇతర సినిమా అవకాశాలు పోతున్నాయని బాధపడలేదు

    బాహుబలి సమయంలో ఇతర సినిమా అవకాశాలు పోతున్నాయని బాధపడలేదు

    ‘బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ఇతర అవకాశాలు పోతున్నాయని ఎప్పుడూ బాధ పడలేదు. ఇలాంటి సినిమా కోసం నా జీవితంలో ఐదు కాదు ఏడు సంవత్సరాలైనా ఇవ్వడానికి సిద్ధమే అని ప్రభాస్ తెలిపారు.

    కేవలం యాక్షన్ పోర్షనే 300 రోజులు

    కేవలం యాక్షన్ పోర్షనే 300 రోజులు

    బాహుబలి ప్రాజెక్టుకు సంబంధించి కేవలం యాక్షన్ పోర్షనే 300 రోజులు చిత్రీకరించారు. ప్రాజెక్టు మొత్తం మీద చాలా కష్టమైన షెడ్యూల్స్ కూడా ఇవే అని ప్రభాస్ తెలిపారు.

    బాహుబలి 3లో ప్రభాస్ నటిస్తాడా?

    బాహుబలి 3లో ప్రభాస్ నటిస్తాడా?

    బాహుబలి 3లో ప్రభాస్ ఉంటాడా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.... ఈ ప్రశ్నకు సమాధానం ఆ సినిమాను నిర్మించే నిర్మాతలు చెబితే బావుంటుంది. బాహుబలి 3 ఉంటుందో? ఉండదో కూడా నాకు తెలియదు. ఒక వేళ అలాంటి అవకాశం వస్తే నేను చేయడానికి సిద్ధమే అని ప్రభాస్ తెలిపారు.

    English summary
    Ever since we have watched Baahubali 2, we just cannot stop swooning over Prabhas. He is not only a gem of an actor but a person. In his latest interview with a daily, the actor revealed the real reason why he rejected his Bollywood debut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X