twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నగ్నంగా కనిపించిన విషయమై ప్రకాష్ రాజ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఒంగోలు గిత్త' చిత్రంలో ప్రకాష్ రాజ్ నగ్నంగా నటించడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమాలో తన పాత్రపై వస్తున్న విమర్శలకు ప్రకాష్‌రాజ్ స్పందించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ తను కావాలనే ఈ పాత్ర చేశానన్నారు. 'ఒంగోలు గిత్త' తాను నగ్నంగా నటించడం పాత్ర ఔచిత్యం కోసమేనని పేర్కొన్నారు. అంతేగానీ కాంట్రావర్శి చేసి లబ్ది పొందాలనే ఆలోచన మాత్రం లేదన్నారు.

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...ఓ అంశంపై మంచి, చెడులు సహజమే. కానీ అలాంటివి పట్టించుకోను. నా కెరీర్‌లో పోషించిన పాత్రలన్నింటిలోనూ ఆదికేశవులు పాత్ర బాగా నచ్చింది. ఎంజాయ్‌ చేసి నటించా. అందరూ అభినందిస్తున్నారు. దీనికి మించి ఇంకేం కావాలి.. ఏదో కొందరు విమర్శిస్తున్నారని నేను బాధపడటం సమంజసం కాదు. కథ అవసరం మేరకు ఇకపైనా ఇలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా నటిస్తా అన్నారు.

    అలాగే...అంతే కాని, గ్లామర్ కోసం నగ్నంగా ఎవరూ నటించరన్నారు. పాత్రలో కూృరత్వం చూపడానికి దర్శకుని భావాలకు అనుగుణంగా విలన్ పాత్రలో నటించానన్నారు. ఇటువంటి పాత్ర తాను ఇంత వరకూ చేయలేదనీ, ఇది ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. షూటింగులతో బిజీగా ఉండడంతో తాను కూడా ఇంకా సినిమా చూడలేదన్నారు. అయితే చిత్రంపై మంచి టాక్ వస్తోందన్నారు. జీవితంలో వెరైటీ పాత్ర, ఛాలెంజింగ్ పాత్ర పోషించినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నాననీ, సినిమాలో అన్నీ అందరికీ నచ్చవనీ ప్రకాష్‌రాజ్ అభిప్రాయడ్డారు.

    ఇక 'బొమ్మరిల్లు' భాస్కర్‌ చిత్రంలో విలన్‌గా నటించిన తొలి చిత్రమిది. ప్రారంభంలో తండ్రి పాత్ర పోషించమని అడిగారు. కానీ నేనే విలన్‌గా నటిస్తానని అడిగా. అదే ఆదికేశవులు పాత్ర. ఇదివరకు అలాంటి పాత్రను నేనెప్పుడూ చేయలేదు. ఓ కీలక సన్నివేశంలో నగ్నంగా నటించాల్సి వచ్చింది. కథ డిమాండ్‌ అధికశాతం ఉండటంతో అలా నటించక తప్పలేదు. సరేనని అంగీకరించా. ఇప్పుడు నా స్నేహితులు, ఇతర నటులు నన్ను అభినందిస్తున్నారు. సినిమాపై కూడా మంచి టాక్‌ వినిపిస్తోంది. అనుకున్న విజయాన్ని సొంతం చేసుకుంది. రామ్‌ నిజంగానే యంగ్‌, ఎనర్జిటిక్‌ హీరో అన్నారు.

    భాస్కర్‌ దర్శకత్వంలోని నాలుగు చిత్రాల్లో మూడింటిలో తండ్రిగా నటించిన విషయమై మాట్లాడుతూ... భాస్కర్‌కు నాపై నమ్మకం ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఓ దర్శకుడు ఓ నటుణ్ని వెతుక్కుని వస్తున్నాడంటే అతడు తప్పకుండా ఆ పాత్రకు న్యాయం చేయగలడనే నమ్మకంతోనే. అలా తన తొలి సినిమాలోనే నన్ను తండ్రి పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. 'బొమ్మరిల్లు' తర్వాత 'పరుగు', 'ఆరెంజ్‌'లో కూడా తండ్రిగా నటించా. ఇప్పుడు కమర్షియల్‌ హంగులతో చిత్రీకరించిన 'ఒంగోలు గిత్త'లో నేను విలన్‌గా మారా. మా ప్రయాణం సవ్యంగా కొనసాగుతోందని నమ్ముతున్నా.

    English summary
    Prakash Raj seems very glad at the response he is receiving for his character in 'Ongolu Gittha'. He said that, the idea of nudity has driven him."It shows the cruelty and character of a man who acts good in front of people take off all the noble covers he has worn and gets free in front of himself', he says.He also cleared that it is not intended to raise controversy and that he is not a glam doll to add glamour to the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X