twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జస్ట్ కోటిన్నర కమిట్ మెంట్ సినిమా అది., దసరా రేసులో గెలిచాడా ఒక అద్బుతం చేసినట్టే

    |

    దసరాకు అన్నీ పది కోట్ల నుంచి డెభై కోట్లకు పైగా ఖర్చు చేసిన సినిమాలు విడుదలవుతుంటే, కేవలం కోటిన్నర కమిట్ మెంట్ తో ఓ సినిమా వీటి మధ్యలో విడదలవుతోంది. అదే ప్రకాష్ రాజ్ డైరెక్ట్ చేసిన మన ఊరి రామాయణం. ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని, జస్ట్ నాలుగు కీలకపాత్రలతో, ఒక చిన్న గది సెట్, ప్లస్ అవుట్ డోర్ లో తీసేసారు. ఈ సినిమాను ఇప్పుడు అభిషేక్ ఫిక్చర్స్ జస్ట్ కోటిన్నర కమిట్ మెంట్ కు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది.

    -దుబాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఓ మహిళ, ఆటోవాలాల ఇలా ఈ మూడుపాత్రలపైనా ఈ చిత్రం నడుస్తుంది. వీరిమధ్య నడిచే భావోద్వేగాలు, ఒక్కొక్కరు ఎవరికి వారు ఎలా తమ జీవితాన్ని తమ తమ పరిధి మేరకు నడిచారో, పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మారారో తెలుపుతుంది. ''శ్రీరామ నవమి రోజు జరిగిన ఓ సంఘటన నలుగురి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనేది ముఖ్య కథ. భుజంగయ్యగా నేను, సుశీలగా ప్రియమణి, ఆటోవాలా శివగా సత్యదేవ్, గరుడ అనే దర్శకుడి పాత్రలో పృథ్వీ నటించాం. నాలుగు పాత్రల మధ్య నడిచే భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అంటూ ప్రకాశ్ రాజ్ మామూలుగా చెప్తూంటేనే క్లిక్ అయితే మాత్రం సూపర్ హిట్ అవకాశాలు కనిపిస్తున్నాయి.

    prakash raj Movi Mana Oori Ramayanam in Dasara Race

    ప్రకాశ్‌రాజ్‌లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, తనకి తెలిసింది చేస్తారు, తెలియని దాని కోసం వినమ్రంగా వేరే వ్యక్తుల దగ్గరికి వెళతారు. 'మీరే చేయాలి' అని బాధ్యనంతా వారిపై పెడతారు. 'మన ఊరి రామాయణం'కి ప్రకాశ్‌రాజ్ ఓ కథకుడు, ఓ దర్శక-నిర్మాత, ఓ నటుడిగా మాత్రమే చేశారు. సాంకేతికత విషయంలో మాత్రం నిష్ణాతులైన వ్యక్తుల్ని సంప్రదించారు. సంగీతం కోసం ఇళయరాజా, ఎడిటింగ్ కోసం శ్రీకర్ ప్రసాద్, కథానారుుక పాత్ర కోసం ప్రియమణి, కళా దర్శకత్వం కోసం శశిధర్ అడపాల్ని సంప్రదించారు. వాళ్లంతా కూడా జాతీయ అవార్డు గ్రహీతలే. ప్రకాశ్‌రాజ్‌తో కలుపుకొంటే మొత్తం ఐదుగురు జాతీయ పురస్కార గ్రహీతలు 'మన ఊరి రామాయణం'కి పనిచేశారు.

    రేపు 7వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్బంగా మీడియా కోసం నిన్న సాయంత్రం సినిమా స్పెషల్ షోను ప్రదర్శించారు. సినిమా చూసిన విమర్శకులు పలువురు సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ నటుడిగా, దర్శకుడిగా మంచి ప్రతిభ కనబరచాడని, సాధారణ మనుషుల్లో కనబడే భావోద్వేగాలను చాలా బాగా చూపాడని ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

    prakash raj Movi Mana Oori Ramayanam in Dasara Race

    ముఖ్యంగా సినిమాలో కథనాన్ని ఎమోషనల్ గా నడపడంలో ఆయన సక్సెస్ అయ్యారని, ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటని పలువురు ప్రశంసిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. ఈ చిత్రాన్ని 'ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్' పై ప్రకాష్ రాజ్ స్వయంగా నిర్మించారు.

    అయితే ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల వ్యవహారం చూస్తే, ఒక్కోసారి కోటి రూపాయిల కమిట్ మెంట్ కూడా ఎక్కువే అనిపిస్తుంది. కానీ ప్రకాష్ రాజ్, ప్రియమణి, పృధ్వీ, ఇళయరాజా లాంటి పేర్లు, కాస్త వైవిధ్యమైన ట్రయిలర్లు అవీ కలిపి మన ఊరి రామాయణం సినిమా విషయంలో కోటిన్నర ఫరావాలేదేమో అనిపిస్తుంది. కానీ సమస్య ఏమిటంటే, మహా మహా భారీ సినిమాలు విడుదలవుతుంటే, మధ్యలో ఈ సినిమా రావడం. దాంతో గట్టిగా వంద థియేటర్లు దొరకడం గగనం అవుతుంది. అదే పెద్ద సమస్య. కాస్త గ్యాప్ ఇచ్చి, పోటీ తక్కువ వున్నపుడు వేసుకుని వుంటే ఈ కమిట్ మెంట్ పెద్ద భారం అనిపించుకోదు.

    English summary
    Five National Award winners team up for Prakash Raj's Telugu Movie Mana Oori Ramayanam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X