twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీనువైట్ల కౌంటర్ కి ప్రకాశ్‌రాజ్‌ అడల్ట్ జోక్ తో కౌంటర్

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రకాష్ రాజ్, శ్రీను వైట్ల మధ్య వివాదం రోజు రోజుకీ ముదురుపోతోంది. సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ తనపై చేసిన వ్యాఖ్యలను దర్శకుడు శ్రీనువైట్ల తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే దానిపై వెంటనే ప్రకాష్ రాజ్...సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఇన్ డైరక్ట్ గా స్పందించారు. ఎక్కడా శ్రీను వైట్ల పేరు ఎత్తకుండా ఆయన ట్వీట్ చేసారు.

    ఆ ట్వీట్ లో ..'కొందరు మారరు... తాటి చెట్టు క్రింద దొరికి పోయిన వాడిని ఏమి చేస్తున్నావ్ అని అడిగితే పాలు తాగుతున్నాను అని చెప్పాడంట " ఆల్ ద బెస్ట్ ఛీర్స్,' అని ట్వీట్ చేసారు. ఇక శ్రీను వైట్ల దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలంటున్నారు. కోన వెంకట్ కూడా ఇదే విషయమై అన్యాపదేశంగా పేర్లు చెప్పకుండా ప్రస్తావిస్తూ... "కొందరు ఎప్పుడూ మిగతా వాళ్లమీద ఫోకస్ చేస్తూంటారు... వాళ్లే మొదట అవుట్ ఫోకస్ లోకి వెళ్లిపోతారు ," అన్నారు.

    శ్రీను వైట్ల తన ప్రెస్ మీట్ లో ...విడుదలైన సినామాపై ప్రతికూలంగా ప్రచారం చేయడం ప్రకాష్‌రాజ్‌కు తగదన్నారు. పవన్‌ కల్యాణ్‌ అంటే తనకు గౌరవమని, ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో తాను సెటైర్లు వేయలేదని స్పష్టం చేశారు. సినిమా ఎలా తీయాలో ప్రకాశ్‌రాజ్‌ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. సినిమారంగంలో జయాపజయాలు సహజమని వ్యాఖ్యానించారు.

    Prakash Raj's on Srinu Vytla's Press Meet

    ఈ మధ్య ప్రకాష్‌రాజ్‌ ఓ విలేకరుల సమావేశంలో 'నాపై రాళ్లు వేయకండి. వాటిని ఇటుకలుగా మార్చి ఇల్లుకట్టుకొంటా..' అంటూ తన భావాల్ని కవిత రూపంలో విశ్లేషించారు. ఇదే కవితను 'ఆగడు'లో ప్రతినాయకుడి పాత్ర చేత చెప్పించారు శ్రీనువైట్ల. 'కవిత నచ్చింది, పెట్టుకొన్నా' అని శ్రీను వైట్ల సమాధానం ఇచ్చారు. అయితే ప్రకాష్‌రాజ్‌ మాత్రం ఈ విషయంపై కాస్త ఘాటుగానే స్పందించారు.

    ''నచ్చితే పెట్టుకోవడం ఏమిటి? సిగ్గులేదా? నా అనుమతి తీసుకోవడానికి సంస్కారం అడ్డొచ్చిందా? నా ఆవేదన, ఆక్రందన అలా అర్థమయ్యాయా? నేను నచ్చలేదు. అందుకే తన సినిమాలోంచి తీసేశారు. మూడేళ్లపాటు నాపై నిషేధం విధించాలని ప్రయత్నించాడు.

    'నీకు నచ్చకపోతే ఇక పరిశ్రమలో ఉండకూడదా?' ఇదేం న్యాయం? నీ సినిమా కోసం ఎవరినైనా వాడుకొంటావా? నాకు ఎవరిపై ద్వేషం లేదు. శ్రీనువైట్ల సత్తా తెలుసు. 'దూకుడు'కోసం పనిచేశాం కదా? రేపు మరో మంచి కథ చెబితే తప్పకుండా నటిస్తా. ఇక్కడంతా పనిచేయడానికి వచ్చాం. చేసుకొందాం. కాకపోతే అహంకారం పనికిరాదు'' అన్నారు ప్రకాష్‌రాజ్‌.

    English summary
    Prakash Raj commented. 'Kondaru Mararu "Thaati Chettu Kinda Doriki Poina Vadni Em Chestunnav Ani Adigithe Paalu Thaaguthunna Ani Chepyadanta" all the best cheers,'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X