»   » ప్రకాష్ రాజ్ న్యూడ్ సీన్ తొలగింపు, బ్యాడ్ టాక్ వల్లే!

ప్రకాష్ రాజ్ న్యూడ్ సీన్ తొలగింపు, బ్యాడ్ టాక్ వల్లే!

Posted by:

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్, కృతి కర్బంధ జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఒంగోలు గిత్త'. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన ప్రకాష్ రాజ్ కథ డిమాండ్ చేయడంతో ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించాడు. ఈ సీన్ కారణంగానే ఈ చిత్రానికి 'A' సర్టిఫికెట్ జారీ అయింది.

ఇలాంటి సీన్లు తెలుగు సినిమాల్లో కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. మర్మాంగాలు కనిపించకుండా ఆ భాగాన్ని బ్లర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సినిమా మొత్తం మీద ఏదో ఒక సందర్భంలో ఉంటే పెద్దగా పట్టించుకోరు. అయితే ఒంగోలు గిత్త సినిమాలో అనేక సార్లు ఈ న్యూడ్ సీన్ రిపీట్ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఇబ్బంది పడక తప్పలేదు.

దీంతో తొలి రోజే సినిమాలోని ఈ సీన్ పై బ్యాట్ టాక్ వచ్చింది. సినిమా కూడా బిలో యావరేజ్ టాక్ తెచ్చుకోవడం తో నిర్మాతలు బెంబేలెత్తి పోయారు. అసలే యావరేజ్ టాక్... ఆ సీన్ తొలగించక పోతే అసలు సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకులు వచ్చే అవకాశమే లేదనే కారణంతో ప్రకాష్ రాజ్ న్యూడ్ సీన్ తొలగించారు.

ప్రకాష్ రాజ్ ఈ ఇందులో ఒంగోలు మిర్చి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆది కేశవులుగా నటించాడు. ఆది కేశవులు గుణంలో మహా చెడ్డవాడు. క్రూరుడు. అయితే పైకి మాత్రం మంచి వాడిలా నటిస్తూ ఉంటాడు. మంచి వాడిగా నటించి ఇంటికి వెళ్లాక తనలోని చెడ్డవాన్ని బయటకు తీస్తాడు. నగ్నంగా మారి మద్యం తాగుతూ ఉంటాడు. అలా చేయపోతే ఆది కేశవులుకు నిద్ర పట్టదు. అదీ సంగతి.

రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

English summary
Prakash Raj’s scenes remove from Ongole Gitta movie. The scenes reaction from the public has not been positive. It was decided to delete the scene.
Please Wait while comments are loading...