twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి ప్రెషర్ ఎక్కువగా ఉంది: ప్రసాద్స్ ఐమాక్స్ మేనేజర్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమాకూ లేనంత క్రేజ్ సొంతం చేసుకుంది. టికెట్ల కోసం పోటెత్తుతున్న జనాన్ని చూసి థియేటర్ల మేనేజర్లు షాకవుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రసాద్స్ ఐమాక్స్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

    బాహుబలి సినిమా నేపథ్యంలో ప్రెషర్ విపరీతంగా ఉంది, టికెట్ల కోసం ఇంత ప్రెషన్ గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ జనరల్ మేనేజర్ తరిమెల శ్రీకాంత్ తెలిపారు. ఉదయం 9 గంటలకే ఆన్ లైన్ కౌంటర్ ఓపెన్ చేసాం. గంటలోపే మా సర్వర్ క్రాష్ అయింది. ఈ గంటలో 7 వేల టికెట్లు జారీ చేసాం. ఒక రోజు ముగిసే సరికి....ఆన్ లైన్ సేల్ తో కలిసి 15 వేల టికెట్లు అమ్ముడయ్యాయి అన్నారు.

    ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఉన్న 6 స్క్రీన్లలో రోజూ 30 షోలు వేస్తున్నారు. మల్టీప్లెక్స్ కెపాసిటీ ఒక షోకు 2,358 సీట్లు ఉన్నాయి. టికెట్ల కోసం క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో పోలీసుల సహాయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

    English summary
    “We opened our counters at 9 a.m. and within an hour, our server crashed. Within that time, we issued about 7,000 tickets. By the end of the day, between 12,000 and 15,000 tickets were sold, including online sale. I have never seen so much pressure for tickets,” said Prasads Multiplex general manager, Tarimela Srikanth about Baahubali tickets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X