»   »  రామ్ చరణ్ హీరోయిన్ బజారుకెక్కింది! (ఫోటో)

రామ్ చరణ్ హీరోయిన్ బజారుకెక్కింది! (ఫోటో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, రామ్ చరణ్ తో కలిసి ‘తుఫాన్' చిత్రంలో నటించిన ప్రియాంక చోప్రా.... తాజాగా ‘బాజార్' మేగజైన్ కవర్ పేజీకెక్కింది. సదరు మేగజైన్ రెండో వార్షికోత్సవం సందర్భంగా ది బ్రైడల్ బ్లాక్ బుక్ 2016 పేరుతో స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేసారు.

ఈ మేగజైన్ కవర్ పేజీపై డిఫరెంట్ బ్రైడల్ లుక్‌తో ఆకట్టుకుంది ప్రియాంక. ఆమె ధరించిన భారీ ముక్కు పుడక, బొడ్డుకు రింగ్.....మగ మహారాజులు వైల్డెస్ట్ ఇమేజినేషన్లోకి వెళ్లేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Priyanka Chopra

ఆస్కార్ అవార్డ్ ప్రజెంట్ చేయబోతున్న ప్రియాంక!
ఆస్కార్ అవార్డుల వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ నెల 28న తేదీన గ్రాండ్ గా ఆస్కార్ ఈవెంట్ జరుగబోతోంది. ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకోవడమే కాదు..... అవార్డులను తమ చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం కూడా గౌరవంగానే భావిస్తారు. ఇప్పటికే కొంత మంది ప్రజెంటర్ల పేర్లు రిలీజ్ చేసారు. తాజాగా విడుదలైన రెండో విడుత ఆస్కార్ ప్రజెంటర్స్ లిస్టులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు స్థానం దక్కింది.

ఈ సెకండ్ లిస్టులో చోటు దక్కించుకున్న వారిలో ఎక్కువ శాతం విభిన్నమైన సాంస్కృతిక నేపథ్యం నుండి వచ్చిన వారే ఉండటం విశేషం. ప్రియాంక చోప్రా అమెరికన్ హిట్ టీవీ సిరీస్ ‘క్వాంటికో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు ప్రజెంట్ చేసే అవకాశం రావడంపై ప్రియాంక చోప్రా ఆనందం వ్యక్తం చేస్తోంది.

English summary
Featuring on the latest edition of "Bazaar Bride", the second anniversary edition of the magazine, dusky siren Priyanka Chopra has once again.
Please Wait while comments are loading...