Don't Miss!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శిల్పా శెట్టి ఏడ్చింది: ప్రియాంక చోప్రా వల్లే....!
హైదరాబాద్: ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మేరీకోమ్' చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా పెర్ఫార్మెన్స్ చూసి అంతా అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ‘మేరీకోమ్' చిత్రాన్ని చూసిన శిల్పా శెట్టి కంటతడి పెట్టింది. మేరీకోమ్ జీవితంలోని వివిధ కోణాలను, కష్టనష్టాలను ఆవిష్కరించిన ఈ చిత్రం చూసిన తర్వాత ఆమె భావేద్వానికి గురయి కంటతడి పెట్టారు.
ఈ విషయాన్ని శిల్పా శెట్టి తన ట్విట్టర్లో వెల్లడిస్తూ...‘మేరీకోమ్ చిత్రంలో అందరూ బాగా నటించారు. కానీ ప్రియాంక చోప్రా పెర్పార్మెన్స్ అద్భుతం. పాత్రలో జీవించింది. ఓమంగ్ దర్శకత్వం బాగుంది. సినిమా చూసిన తర్వాత నా కళ్లు చెమర్చాయి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా' అంటూ శిల్పా శెట్టి ట్వీట్ చేసింది.
ఈ చిత్రం కోసం ప్రియాంక చోప్రా చాలా కష్ట పడింది. మేరీ కోమ్ పాత్రలో జీవించడానికి స్వయంగా బాక్సింగ్ శిక్షణ తీసుకోవడంతో పాటు, మేరీ కోమ్‌తో పాటు కొన్ని రోజులు ఉండి మెళకువలు నేర్చుకుంది. మణిపూర్ ప్రాంతంలోని పల్లెటూరుకు చెందిన అమ్మాయి మేరీ కోమ్(ప్రియాంక చోప్రా). బాక్సింగ్ అంటే ఆసక్తి. తాను కూడా గొప్ప బాక్సర్ కావాలని, దేశానికి ఒలంపిక్ మెడల్ సాధించాలని కలలు కంటూ ఉంటుంది. బాక్సింగ్ అంటేనే పురుషాధిప్యం ఉన్న క్రీడ. అలాంటి క్రీడలో అమ్మాయిలు ఎంటరవ్వడం అంటే మామూలు విషయం కాదు. దీంతో ఇటు ఇంట్లో, అటు సమాజంలోని పరిస్థితులు ఆమెను పూర్తిగా నిరాశకు గురి చేస్తాయి. ఆ క్రీడ వైపు వెళ్లడానికి తండ్రి నిరాకరిస్తాడు. తండ్రిని ఎదురించి బాక్సింగ్ రింగులోకి ఎంటరైన తర్వాత ఎన్నో అవామానాలు, ఆటు పోట్లు. చివరకు ఆమె లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేది ఈ చిత్రం.