twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పన్ను మినహాయింపు దొరికింది

    By Srikanya
    |

    ముంబయి: భారతీయ బాక్సర్‌ మేరీకోం జీవితం ఆధారంగా తీసిన సినిమా 'మేరీకోం'కి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకాచోప్రా మేరీకోం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

    సాధారణ కుటుంబంనుంచి వచ్చిన ఒక మహిళ కృషి, దృఢచిత్తాలతో ఇంతటి ఉన్నతమైన స్థాయికి ఎదిగి విశ్వవేదికలపై భారత పతాకను ఎగరవేయడం దేశానికే గర్వకారణమని, ఆమె జీవితంనుంచి అందరూ స్ఫూర్తి పొందాలనే ఈ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చిత్ర బృందం అందుకు కృతజ్ఞతలు తెలిపింది.

    మేరీకోమ్‌' నాయికా ప్రాధాన్య చిత్రం కాదని, దాన్ని సాధారణ చిత్రంలాగే చూడాలని ఆ చిత్ర నాయిక ప్రియాంక చోప్రా అన్నారు. శుక్రవారం ఆమె ఈ చిత్ర ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 5న విడుదలయ్యే ఈ చిత్రం తన జీవితంలో మైలురాయని తెలిపారు.

    ఒలంపిక్స్‌ కాంస్య పతక విజేత బాక్సర్‌ మేరీకోమ్‌ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఉపాధ్యాయుల దినోత్సవం రోజు విడుదల కానుండటంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను విధించకపోవడం శుభసూచకమన్నారు.

    Priyanka Chopra power packed punch

    మేరీకోం చిత్రం ఆడియో విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకూ మేరీకోంకు పోలికలున్నాయన్నారు. పెంపకంలో, పురుషప్రధాన వృత్తుల్లో మహిళలుగా జీవితాన్ని ఎదుర్కొన్న తీరులో... పోలికలున్నాయని ప్రియాంక పేర్కొన్నారు. మేరీకోం జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా సెప్టెంబరు 5న విడుదల కానుంది.

    ప్రియాంక మాట్లాడుతూ ''బాగ్‌ మిల్కా బాగ్‌'తో ఈ చిత్రాన్ని పోల్చలేం. ఎందుకంటే ఓ క్రీడాకారిణి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న తొలి చిత్రమిది. క్రీడా చిత్రాల్లో ఓ ట్రెండ్‌ అనడం ఈ చిత్రాన్ని అగౌరవపరచడమే. దేశం గర్వించదగ్గ చిత్రం'' అని చెప్పింది.

    అలాగే...ఈ చిత్రం ఈ చిత్రాన్ని మామూలు రెగ్యులర్ సినిమాల్లా పరిగణించవద్దని ఆమె కోరింది. తన నట జీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు ఏ సినిమాకూ కష్టపడలేదని తెలిపింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించటమంటే మాటలు కాదని, అటువంటి అద్బుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంత పొగడ్తల్లో ముంచెత్తింది.

    ఇక ఈ చిత్రంలో మేరిలీ శరారీకృతిని ప్రదర్శించటానికి రోజుకు పదిహేను గంటలు పాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. భాక్సింగ్ లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి భాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్ధాయిలో మన దేశ కీర్తి పతాకం ఎగిరేలా ఒలింపిక్స్ లో పతకం సాధించిందని వివరించింది. ఈ చిత్రానికి దర్శకుడు ఒమాంగ్ కుమార్.

    English summary
    Priyanka who has worked very hard for her upcoming film ‘Mary Kom’ is riding high on the hype of her super fit avatar in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X