» 

అంతటి అదృష్టాన్ని ఎవరు వదులుకొంటారు..నేను రెడీ..!

Posted by:
Give your rating:

టాలీవుడ్‌ అందగాడు, ప్రిన్స్‌ మహేష్‌ బాబు, మణిరత్నంల కాంబినేషన్‌ లో రాబోయే సంచలన చిత్రంలో మహేష్‌ కు జోడీగా ప్రియాంకచోప్రా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇంకా చర్చల్లో ఉండటంతో విషయం ధృవీకరణకు రాలేదు. కాగా ప్రియాంక మాత్రం మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతోంది. అటువంటి అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. మణిరత్నం లాంటి ట్యాలెంటెడ్‌ దర్శకుడు కోరి అవకాశం ఇస్తే అది తన అదృష్టంగా భావిస్తానంటోంది ప్రియాంక.

కాగా ఈ చిత్రంలో మహేష్‌ బాబుకు చెల్లెలు పాత్రలో అనుష్కను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇదే చిత్రం తమిళ వెర్షన్‌ లో విజయ్‌ హీరోగా నటిస్తుండగా...విజయ్‌ సరసన అనుష్కను హీరోయిన్‌ గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ప్రియాంకచోప్రాకు నార్త్‌ లో, అనుష్కకు సౌత్‌ లో ఉన్న క్రేజ్‌ ను దృష్టిలో ఉంచుకుని మణిరత్నం ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. రెండు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందించే ఈ చిత్రానికి తెలుగులో 'వీరుడు" అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.

Read more about: priyanka chopra, mahesh babu, mani ratnam, veerudu, vijay, anushka, ప్రియాంక ఛోప్రా, మహేష్ బాబు, మణిరత్నం, వీరుడు, విజయ్, అనుష్క
English summary
It is a dream come true for any actress to work with Mani Ratnam. Bollywood actress Priyanka Chopra is serious contender for heroine’s role in Mani Ratnam’s bi-lingual movie starring Mahesh Babu, Arya and Vijay.Priyanka Chopra will be paired opposite Mahesh Babu.
Please Wait while comments are loading...