twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' లుక్ రెస్పాన్స్ కు నిర్మాత ఇలా...

    By Srikanya
    |

    హైదరాబాద్‌: స్టార్‌ డైరక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి'. రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా కథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసిిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో నిర్మాతలు చాల ఆనందంగా ఈ విషయమై ట్వీట్ చేసారు.

    శోభుయార్లగడ్డ ట్వీట్ చేస్తూ.... "మీరు చూపిస్తున్న ఉత్సాహానికి, అందిస్తున్న ప్రోత్సాహానిక చాలా సంతోషంగా ఉంది.. ధాంక్యూ, మేం ఇంకా ఇలాంటివి చాలా ప్లాన్ చేసాం..."అంటూ ట్వీట్ చేసారాయన.

    కవచాలు, శిరస్త్రాణం ధరించి, కరవాలం చేతపట్టి యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడే యోధుడిగా ప్రభాస్‌ తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. 'మేకింగ్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో ఇప్పటికే పలు వీడియోలను చిత్రం బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

    Producer of Bahubali tweets on new look

    'బాహుబలి' గా ప్రభాస్‌ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. దీనికి సమాధానంగా ఆయుధంతో వీరత్వం ప్రదర్శిస్తోన్న బాహుబలి పోస్టరును తాజాగా ఫేస్‌బుక్‌లో పెట్టారు.

    ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. లీ మాస్టర్‌ నేతృత్వంలో రామోజీ ఫిల్మ్‌సిటీలో రానాపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.

    రాజమౌళి కొత్త ఆలోచన:

    లైవ్‌ యాక్షన్‌ సినిమా, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత సినిమా.. ఈ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. కెమెరా ముందు జరుగుతున్న సన్నివేశాన్ని యథాతథంగా చూపించడం లైవ్‌ యాక్షన్‌ సినిమా. ఖాళీ ప్రదేశంలో బ్లూమేట్‌ ముందు చిత్రీకరించి ఆ తర్వాత దానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి ఏ పెద్ద కోట లోపలో, లేదా కోట ముందో ఉన్నట్లు చూపించడం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత చిత్రమవుతుంది. రెండో రకం చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురుగా ఏమీ లేకుండానే ఉన్నట్లు భావించి నటించాల్సి వస్తుంది.

    ఇలాంటి సన్నివేశాలకు దర్శకత్వం వహించడం కష్టసాధ్యమైన పనే. అందుకే బ్లూమేట్‌ ఆధారంగా తీసే సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే కళ్లకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కనపడేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి. ఆయన తాజా చిత్రం 'బాహుబలి' కోసం ఏఎండీ అనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థతో కలసి పని చేస్తున్నారు. ఈ పనిలో మరో సంస్థ మకుట కూడా పాలుపంచుకుంటోంది. ఏఎండీ తాజాగా ఓ మైక్రోచిప్‌ తయారు చేసే పనిలో ఉందట.

    ఓ చిప్‌లో మొత్తం ఎఫెక్ట్స్‌ను అప్‌లోడ్‌ చేసి దాన్ని కళ్లజోడుకు జోడించి చూస్తే బ్లూమేట్‌ మీద ఏమైతే విజువల్‌ ఎఫెక్ట్స్‌ని మిక్స్‌ చేస్తారో.. అవి కనిపిస్తాయి. దీని వల్ల చిత్రీకరణ సులభతరమవుతుంది. రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి రూపొందించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు.

    English summary
    Shobu Yarlagadda tweeted "We are overwhelmed by your support n enthusiasm for#Baahubali! Thank u! We have planned lots more new n exciting stuff! BUT....as much as we would all like to see a teaser or another making video, we won't be able to release one soon..#Baahubali"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X