» 

మరో నిర్మాత కక్కుర్తి...అరెస్టు

Posted by:

Vallabhaneni Ashok
ఈ మధ్య సినిమా నిర్మాతుల సినిమాలు తీయడం పక్కన పెట్టి నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. కొందరు నిర్మాతలు హత్య కేసుల్లో ఇరుక్కుంటే, మరికొందరు కబ్జా కోసుల్లో, మరికొందరు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. దీనంతటికీ కారణం డబ్బే. తాజాగా మరో నిర్మాత డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడు. అతడిపేరు వల్లభనేని అశోక్. ఎర్రగులాబీలు, సెగ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా వల్లభనేని అశోక్ కబ్జా కేసులో అరెస్టయ్యారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని ఓ అపార్టుమెంటులోని రెండు ప్లాట్లను అశోక్ కబ్జా చేశాడని ఎస్ ఆర్ నగర్ ఫిర్యాదు అందండంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆయనతో మరో 11మంది ఈ కేసులో అరెస్టయ్యారు.

జూబ్లీ హిల్స్ లోని రూ. 5 కోట్ల విలువ చేసే భూమి కోసం నిర్మాత అశోక్ బెదిరింపులకు పాల్పడ్డాడని గతంలో ఇతనిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా అరెస్టు కావడం ఫిల్మ్ నగర్ లో చర్చ నీయాంశం అయింది.

Read more about: vallabhaneni ashok, sega, వల్లభనేని అశోక్, సెగ
English summary
Producer Vallabhaneni Ashok arrested in case of Kabja.
Please Wait while comments are loading...