»   » పులి: విఎఫ్ఎక్స్ ముందు, తర్వాత... (ఫోటోలు)

పులి: విఎఫ్ఎక్స్ ముందు, తర్వాత... (ఫోటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పులి'. చాలా కాలం తర్వాత శ్రీదేవి ఈచిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. శృతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించారు. కన్నడ స్టార్ సుదీప్ కీలకమైన పాత్రలో నటించారు.

దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ ముందు, తర్వాత సీన్లు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ గమనించవచ్చు.

అక్టోబర్ 1న విడుదలైన ‘పులి' సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న రేంజిలో బిజినెస్ చేయడం లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. తొలిరోజు ఆర్థిక సమస్యలతో విడుదల ఆలస్యం అయింది. దానికి తోడు సినిమా టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో సినిమా బిజినెస్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

స్లైడ్ షోలో విజువల్ ఎఫెక్ట్స్ ఫోటోస్...

శ్రీదేవి, సుదీప్

శ్రీదేవి, సుదీప్ నటించిన సీన్లో విజువల్ ఎఫెక్ట్స్ ముందు, తర్వాత ఇలా...

భారీగా ఖర్చు

దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు.

సెట్టింగ్స్

ఈ సినిమా కోసం సెట్టింగ్స్ వేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసారు.

గ్రాఫిక్సే

సినిమాలో కనిపించే ఈ కోట అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే.

అంతా మాయ

సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఎంత మాయ చేస్తాయో ఈ సీన్ చూస్తే అర్థమవుతుంది.

రిలీజ్ ఇబ్బందులు

అక్టోబర్ 1న విడుదలైన ఈ సినిమా విడుదల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంది.

హాలీవుడ్ రేంజిలో

పులి సినిమా హాలీవుడ్ రేంజిలో ఉందని రజనీకాంత్ తో పాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు పేర్కొన్నారు.

సూపర్బ్

విజువల్ ఎఫెక్ట్స్ తర్వాత, విజువల్ ఎఫెక్ట్స్ ముందు సినిమాలోని ఓ సీన్...

హన్సిక

పులి సినిమాలో హాన్సిక. హన్సిక ఇందులో ఎంతో గ్లామరస్ గా కనిపించింది.

English summary
Tamil star Vijay's Puli movie‬ before and after VFX images.
Please Wait while comments are loading...