twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ లాల్ అండతో 'బాహుబలి'ని బీట్ చేసేసాం... ఫ్యాన్స్ పండగ

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాహుబలి రిలీజైన దగ్గరనుంచి ..కలెక్షన్స్ విషయం వచ్చేసరికి ప్రతీ ఒక్కరూ ఆ సినిమాతోనే పోల్చుకుంటున్నారు. అయితే ఎవరు ఎంతలా పోల్చుకున్నా ఆ సినిమా కలెక్షన్స్ ని బీట్ చేయలేకపోయారు. కానీ మోహన్ లాల్ మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యారు.

    ఆయన తన తాజా చిత్రం పులి మురగన్ తో రెండువారాల్లో బాహుబలి కలెక్షన్స్ దాటేసారని మళయాళ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే అది కేరళలో బాహుబలి కలెక్షన్స్ ని మాత్రమే.దీంతో చిత్రం నిర్మాతలు చాలా ఉషారుగా ఉన్నారు. కేవలం ఇదంతా మోహన్ లాల్ వల్లే సాధ్యమైందని చెప్తున్నారు.

    ఇక పులిమురగన్ చిత్రం త్రివేండ్రమ్ లో కొత్త రికార్డ్ లుక్రియేట్ చేస్తోంది. త్రివేండ్రమ్ లోని ఏరియా ప్లెక్స్ ధియోటర్ లో కోటి మార్క్ ని దాటింది. అక్కడ బాహుబలి గతంలో 24 రోజుల్లో కోటి మార్కుని దాటింది. అయితే పులి మురగన్ కేవలం 15 రోజుల్లోపే ఈ రికార్డ్ ని క్రియేట్ చేసింది.

    Pulimurugan Box Office: Beats The Collection Record Of Baahubali!

    మళయాల చిత్ర సీమలోనే మునుపెన్నడు లేని రీతన అత్యంత భారీ వసూళ్లతో దూసుకుపోతుంది మోహన్ లాల్ తాజా చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ లో ఇప్పటివరకు క్రియేటైన రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తూ విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 15 కోట్లకి పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది ఈ విజువల్ వండర్.

    ప్రపంచవ్యప్తంగా కూడా పులి మురుగన్ కి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. మోహన్ లాల్ సినీ కెరీర్ లో ఈ రెంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి, ఇక ఈ ఏడాది విడుదలైన మోహన్ లాల్ మరో సినిమా 'ఒప్పమ్' కూడా హిట్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం.

    'జనతా గ్యారేజ్' సినిమాతో తెలుగులోనూ సూఫర్‌హిట్ అందుకున్న మోహన్‌లాల్ దసరా కానుకగా 'పులి మురుగన్' చిత్రం త్వరలోనే తెలుగు నాట కూడా సందడి చేయనుంది. తెలుగులో 'మన్యం పులి' పేరిట శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విడుదలైన తొలివారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మల్లూవుడ్‌లో 'పులిమురుగన్' రికార్డ్ క్రియేట్ చేసింది.

    ఈ నేపథ్యంలో 'పులి మురుగన్' చిత్రాన్ని సైతం కృష్ణారెడ్డి తెలుగునాట పెద్ద హిట్ చేస్తారని మలయాల వెర్షన్ నిర్మాత తోమిచమ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అలాగే 'మన్యంపులి'గా తెలుగునాట కూడా తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది.

    జగపతిబాబు, కమలినీ ముఖర్జీ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు:వైశాఖ, కథ:ఉదయకృష్ణ, సంగీతం:గోపీసుందర్, కెమెరా:షాజీకుమార్.

    English summary
    Pulimurugan, has set a new record in one of the theatres in Trivandrum, as well. The movie, reportedly has crossed the 1 Crore mark in Aries Plex theatre in Trivandrum. The film took just 15 days to cross the mark whereas Baahubali took 24 days to cross the 1Crore figure.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X