twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి ఇంటర్వూ: 'లోఫర్‌' ఎలాంటి సినిమా? ఆ టైటిల్ పెట్టడానికి కారణం

    By Srikanya
    |

    హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి డిఫెరెంట్ టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి..కథేంటి అనే ఆసక్తి చాలా మందిలో ఉంది.

    పూరి జగన్నాథ్ తన పుట్టిన రోజు సందర్బంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. లోఫర్ చిత్రం ఏ సెంటిమెంట్ తో తీస్తున్నారో, ఎలాంటి కథో, ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించారు.

    పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' తర్వాత ఆ తరహాలో చేస్తున్న మరో సినిమా ఇది. అమ్మ సెంటిమెంట్‌ ఆధారంగా తెరకెక్కించా. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ సెంటిమెంట్‌ సినిమా చేయడం నాకే కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. ట్విట్టర్‌లోనూ, అక్కడా ఇక్కడా చాలా మంది నన్ను పదే పదే అడిగేవాళ్లు... 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' లాంటి సినిమా చేయరా? అని. ఈ సినిమాతో మళ్లీ అలాంటి ఓ మంచి కథ కుదిరింది. రచయితగా నాకు సంతృప్తినిచ్చిన కథ ఇది అని అన్నారు.

    పూరి జగన్నాథ్ ఇంకేమన్నారో ఇక్కడ చూడండి...

    'లోఫర్‌' అనే పేరు పెట్టారేంటి?

    'లోఫర్‌' అనే పేరు పెట్టారేంటి?

    కథలో భాగంగానే ఆ పేరు పెట్టాం. ఇందులో హీరోకి పనీ పాట ఏమీ ఉండదు. కానీ చివరికి మంచివాడిలా మారతాడు. ఈ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూశాక బాగా అర్థమవుతుంది.

    బుర్ర తినేస్తున్నారు

    బుర్ర తినేస్తున్నారు

    అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసినప్పట్నుంచి పేరు మార్చమని రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత సి.కల్యాణ్‌ నా బుర్ర తినేస్తున్నారు (నవ్వుతూ).అమ్మ బంధం చుట్టూ తిరిగే కథకి ఇలాంటి టైటిల్ ఏంటని అంటున్నారు.

    వరుణ్‌తేజ్‌ పొడుగు ఉన్నా...

    వరుణ్‌తేజ్‌ పొడుగు ఉన్నా...

    వరుణ్ తేజ చాలా బాగా నటించాడు. తప్పకుండా మంచి హీరో అవుతాడు. నాగబాబుగారు గర్వపడేలా చేస్తాడు. నిజాయతీగా నటిస్తాడు. ఎంత పొడుగున్నా వరుణ్‌లో ఓ రకమైన అమాయకత్వం కనిపిస్తుంటుంది.

    కెరీర్ కి ఉపయోగపడుతుంది

    కెరీర్ కి ఉపయోగపడుతుంది

    ఆ అమాయికత్వం అతడి కెరీర్‌కి బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నా.

    చూడగానే నచ్చుతుంది

    చూడగానే నచ్చుతుంది

    అలాగే ఈ సినిమాతో దిశా పటాని అనే హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాం. ఒకసారి చూడగానే నచ్చుతుంది.

    సీన్స్ చూసి వర్మ ఏమన్నారంటే...

    సీన్స్ చూసి వర్మ ఏమన్నారంటే...

    రామ్‌గోపాల్‌ వర్మకి బంధాలు, అనుబంధాలు, సందేశాత్మక చిత్రాలు నచ్చవు. సెంటిమెంట్లంటే అసహ్యం, అలాంటి సినిమాలు నేను చేయనని చెబుతుంటారు వర్మ. కానీ ఈ సినిమాలోని సన్నివేశాలు చూశాక భావోద్వేగానికి గురయ్యారు.

    అమ్మ మీదే ట్రైలర్ కట్ చేసారు

    అమ్మ మీదే ట్రైలర్ కట్ చేసారు

    నన్ను ఎడిటింగ్‌ రూమ్‌లో నుంచి బయటికి పంపించేసి... అమ్మ మీద 30 సెకన్ల ఓ ప్రోమోని కట్‌ చేశారు.

    నాకు దక్కిన గొప్ప ప్రశంస

    నాకు దక్కిన గొప్ప ప్రశంస

    వర్మ అమ్మపై ప్రోమో కట్‌ చేయడం నాకే చిత్రంగా అనిపించింది. అది నాకు దక్కిన ఓ గొప్ప ప్రశంసగా భావించా.

    కొత్తగా ప్రమోషన్

    కొత్తగా ప్రమోషన్

    ఈ చిత్రం ప్రమోషన్ ని కొత్తగా చేయాలని పూరి జగన్నాథ్ భావించారు. ఈ మేరకు ఆయన లొకేషన్ నుంచి షూటింగ్ లైవ్ ఇస్తున్నారు. ఆ లైవ్ ని చూడటం కోసం ఆయన తన Periscope ఛానెల్ లింక్ ని ట్వీట్ చేసారు.

    ఐటం సాంగ్

    ఐటం సాంగ్

    పూరి జగన్నాథ్ సినిమా అంటేనే అదిరిపోయేలా ఐటం సాంగ్ ఉంటుంది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ పూరి జగన్నాథ్ అంచనాలకు ఏ మాత్రం తగట్గకుండా ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. మోరాకన్ డాన్సర్ నోరా పతేహితో ఈ చిత్రంలో స్పెషల్ ఐటం సాంగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఎవరెవరు...

    ఎవరెవరు...


    ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించబోతున్నారు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు.

    విలన్ గా...

    విలన్ గా...

    ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ ‘పటాస్', రీసెంట్‌గా విడుదలైన విజయ్ ‘జిల్లా' చిత్రంలో ప్రతినాయకుడిగా అలరించిన చరణ్ దీప్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోందని టాక్.

    English summary
    Director Puri Jagan talked about his latest Lofer movie. This project will be Varun’s first commercial film, according to producer C. Kalyan.“Loafer” joins Jagannadh’s long list of quirky titles such as “Pokkiri”, “Idiot” and “Desamuduru”. “Besides being a regular Puri Jagannadh entertainer, the film will be high on motherly sentiment and action. It will be Varun’s first stint at doing something commercial for the masses. We’re planning to release it during Dussehra,” producer Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X