twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊహించని వీడియో: పూరి జగన్ షేర్ చేసాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : బ్యాంకాక్, థాయ్ లాండ్ లలో ఎక్కువగా గడిపే దర్శకుడు పూరి జగన్నాధ్. ఆయన తాజాగా అక్కడ తాను చూసిన ధాయలాండ్ వాసుల వినాయిక చవితి ఉత్సవాన్ని వీడియో తీసి ఫేస్ బుక్ లో షేర్ చేసారు. ఆ వీడియోని మీరూ చూడండి.

    People of Thailand are singing "Happy Birthday ganapathi" on Ganesh chaturthi .

    Posted by Puri Jagannadh on 20 September 2015

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ వీడియోలో ధాయ్ లాండ్ వాసులు ..వినాయక చవితి సందర్బంగా హ్యాపీ బర్తడే గణపతి అంటూ సాంగ్ పాడటం విశేషం. ఆ పాట గమనించండి. మనకు ఇక్కడ ఈ ట్రెడిషన్ లేదు.

    ఇక పూరీ తాజా చిత్రం లోఫర్ విషయానికి వస్తే....

    వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ ని కొత్తగా చేయాలని పూరి జగన్నాథ్ భావించారు. ఈ మేరకు ఆయన లొకేషన్ నుంచి షూటింగ్ లైవ్ ఇస్తున్నారు. ఆ లైవ్ ని చూడటం కోసం ఆయన తన Periscope ఛానెల్ లింక్ ని సైతం ట్వీట్ చేసారు.

    Puri Jagannath shared Happy Birthday Vinayak Video

    ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించబోతున్నారు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ సినిమా అంటేనే అదిరిపోయేలా ఐటం సాంగ్ ఉంటుంది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ పూరి జగన్నాథ్ అంచనాలకు ఏ మాత్రం తగట్గకుండా ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. మోరాకన్ డాన్సర్ నోరా పతేహితో ఈ చిత్రంలో స్పెషల్ ఐటం సాంగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

    నోరా పతేహి ఇప్పటికే టెంపర్, బాహుబలి, కిక్ 2 చిత్రాల్లో ఐటం సాంగ్స్ తో అదరగొట్టింది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ ఆమె సాంగ్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటుందని, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఇందుకు సంబంధించిన సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

    ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ ‘పటాస్', రీసెంట్‌గా విడుదలైన విజయ్ ‘జిల్లా' చిత్రంలో ప్రతినాయకుడిగా అలరించిన చరణ్ దీప్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోందని టాక్.

    English summary
    Puri Jagannadh shared above video and said..."People of Thailand are singing "Happy Birthday ganapathi" on Ganesh chaturthi "
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X