twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న పోసాని, ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి ఓ రేంజిలో కౌంటర్, అంతా షాక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొన్నటికి మొన్న ఓ టీవీ ఛానెల్ లైవ్ షో లో తెలంగాణా కాంగ్రేస్ నేత వి.హెచ్ హనుమంతరావు పై పోసాని కృష్ణ మురళి విరుచుకు పడ్డారు. ఇప్పుడు ఆర్ నాయారణమూర్తి వంతు వచ్చింది. ఆయన విహెచ్ హనుమంతరావుకు తనదైన శైలీలో మాట్లాడి కౌంటర్ ఇచ్చి అందరినీ షాక్ కు గురి చేసారు.

    ఇంతకీ జరిగిన విషయం ఏమిటీ అంటే... కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహిస్తోన్న అలయ్ బలయ్ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వైభవంగా కొనసాగింది. ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా దత్తాత్రేయ నిర్వహిస్తోన్న ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి పులువురు ప్రముఖులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు కు ఆర్. నారాయణ మూర్తికి మధ్య వాడీ వేడీ మాటల యుద్దం జరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఎప్పటిలాగే విహెచ్ మాట్లాడితే ఎవరూ ఊహించని విధంగా ఆర్ నారాయణ మూర్తి మాట్లాడి షాక్ ఇచ్చారు.

    వీహెచ్ చెప్పింది ఇదీ

    వీహెచ్ చెప్పింది ఇదీ

    వీహెచ్ మాట్లాడుతూ.. రాయలసీమలోనూ - ఆంధ్రప్రాంతంలోనూ ఇలాంటి సంస్కృతిలేదని అక్కడ అలయ్ బలయ్ జరపాలని దత్తాత్రేయను - వెంకయ్య నాయుడిని కోరుతున్నట్లు ప్రకటించారు.

    ఏందిరా బయి అన్నారు

    ఏందిరా బయి అన్నారు

    కొత్తలో మేము అలై బలై అన్నప్పుడు ఆంద్రోలన్నారు ఈ అలయ్ బలయ్ ఏందిరా బయ్ అన్నారు - ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం అన్నాము. ఈ సాంప్రదాయం ఆంధ్రలో ఉన్నదో లేదో తెలియదు. అన్నారు విహెచ్.

    అక్కడ కూడా షురూ చేయమని

    అక్కడ కూడా షురూ చేయమని

    కానీ వెంకయ్య నాయుడు - సుజనా చౌదరీలకు చెబుతున్నాను - ఎందుకంటే మా దగ్గర ఎంత కొట్లాడుకున్నా - ఎంత తన్నుకున్నా దసరా వచ్చిందంటే అందరం కలిసిపోతాం. కాబట్టి దత్తన్నకు చెబుతున్నా రాయలసీమలో కూడా ఈ అలయ్ బలయ్ ని షురూ చేయమని.

    ఎంత శతృత్వం ఉన్నా

    ఎంత శతృత్వం ఉన్నా

    రాయలసీమలో ఒకరినొకరు చూసుకోరు - ఈ అలయ్ బలయ్ అక్కడికీ పోతే వాళ్లలో కాస్త ఆలోచన వస్తుందని. ఇక్కడ ఎంత శతృత్వం ఉన్నా పెళ్లికీ - చావుకీ వెళ్తాం కానీ రాయలసీమలో ఆ ఆనవాయితీ లేదు" అని ముగించారు విహెచ్.

    విహెచ్ కు నారాయణ మూర్తి ఇలా..

    విహెచ్ కు నారాయణ మూర్తి ఇలా..

    దానికి ఆర్. నారాయణమూర్తి తనదైన సౌండ్ ఫుల్ కౌంటర్ ఇచ్చి షాక్ ఇచ్చారు. రాయలసీమ ప్రజల మంచితనం గురించి అలయ్ బలయ్ గురించి తనదైన శైలిలో మాట్లాడారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది.

    నారాయణ మూర్తి ప్రసంగిస్తూ..

    నారాయణ మూర్తి ప్రసంగిస్తూ..

    ఆర్ నారాయణమూర్తి ప్రసంగిస్తూ... "విభిన్న మతాలతో కులాలతో ఉన్న దేశం మన భారతదేశం - భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్న దేశం మన భారతదేశం. అలాంటి భరతదేశంలో హైదరాబాద్ లో అలయ్ బలయ్ జరపడం ఎంతో అవసరం.. ఎందుకంటే ఇది మినీ భారత్" అని మొదలుపెట్టి వెంటనే రాయలసీమ టాపిక్ కి వచ్చేశారు.

    వీహెచ్ కు కౌంటర్..

    వీహెచ్ కు కౌంటర్..

    "హైదరాబాద్ లోనే కాదు రాయలసీమలో ఈ అలయ్ బలయ్ పెట్టు అంటున్నారు ఈయన (వీహెచ్).. రాయలసీమలో కక్షలూ కార్పణ్యాలే కాదు అంతకు మించి అభిమానాలు - ఆదరణలు కూడా ఉంటాయి" అని వీహెచ్ కు స్పాట్ కౌంటర్ ఇచ్చేశారు.

    నేనూ కూడా ఆంధ్రావాడినే

    నేనూ కూడా ఆంధ్రావాడినే

    "రాయలసీమలో ఆగర్భ శతృవైనా ఇంటికి వస్తే క్షమించి - ఆదరించి అలయ్ బలయ్ చేస్తారు. నేను కూడా ఆంధ్రావాడినే అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చా అలయ్ బలయ్ ఇవ్వడానికి" అన్నారు.

    అన్ని చోట్లా కక్షలూ - కార్పణ్యాలు

    అన్ని చోట్లా కక్షలూ - కార్పణ్యాలు

    నారాయణమూర్తి.. కంటిన్యూ చేస్తూ... "కక్షలూ కార్పణ్యాలు ఎక్కడ లేవు? ఆంధ్రలో లేవా తెలంగాణలో లేవా యూపీలో లేవా... ఎక్కడలేవు కక్షలూ - కార్పణ్యాలు? కాబట్టి దత్తాత్రేయ గారూ మీరు స్వచ్చ భారత్ ను ఎలా జరిపిస్తున్నారో అలాగే దేశవ్యాప్తంగా ఈ అలయ్ బలయ్ ని జరిపించండి" అని కోరారు.

    ఖాళీనే

    ఖాళీనే

    వరస పెట్టి విప్లవ చిత్రాలు తీసిన ఆర్ నారాయణ మూర్తి ఈ మధ్య కాలంలో కాస్త వెనకపడ్డారనే చెప్పాలి. ఆయన అప్పట్లో తీసిన చిత్రాలు తరహా కథాంశా లు ఈ కాలానికి సరిపడవు అనుకున్నారేమో ఏ సినిమానూ మొదలెట్టలేదు.

    English summary
    R. Narayana Murthy gave Counters To Hanumantha Rao Over Rayalaseema Factionism In Alai Balai Program,Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X