» 

బాచిలర్ కుర్రాళ్ల 'రేస్' త్వరలోనే...

Posted by:

హైదరాబాద్: బాచిలర్ కుర్రాళ్ల రేసు త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. బ్యాంకాక్ వెళ్లిన కొంత మంది కుర్రాళ్లకు కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలు వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో రూపొందిన చిత్రం రేస్.

విక్రమ్, కార్తిక్, భరత్ కిశోర్, దిశా పాండే, సికితా నారాయణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ రాపర్తి దర్శకుడు. అన్నే రవి నిర్మాత. దాదాపు ఈ చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈ నెల మూడో వారంలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న రేస్ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ - ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది అని, కథనం ఉత్కంఠను రేకెత్తిస్తుందని చెప్పారు. మిగిలి ఉన్న ఒక్క పాటను బ్యాంకాక్‌లోని సుందర ప్రదేశాల్లో శంకర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించినట్లు, దీంతో చిత్రనిర్మాణం పూర్తయినట్లు అన్నే రవి చెప్పారు. ఈ నెల ద్వితీయార్థంలో పాటలను విడుదల చేస్తామని చెప్పారు.

రేస్ చిత్రానికి పాటలు: శ్రీమణి, కెమెరా, మురళీమోహన్ రెడ్డి, సంగీతం: వివేక్ సాగర్, సంజయ్, నిర్మాణం ఆనంద్ సినీ చిత్ర

Read more about: race, vikram, రేస్, విక్రమ్
English summary
Shooting part of Race film is completed. All set to release audio in the second half od this month, producer Anne Ravi said.

Telugu Photos

Go to : More Photos