» 

ఐటం సాంగ్ అంటూ అర్ద నగ్నంగా...(ఫోటో పీచర్)

Posted by:

హైదరాబాద్ : ఐటం సాంగ్ ఉంటే సినిమా హిట్..అంతేకాదు ఐటం సాంగ్ లో ఎంత చూపిస్తే అంతలా ఆ ఐటం గర్ల్ సూపర్ హిట్. దానికి తోడు పాత రీమిక్స్ తో ఐటం సాంగ్ ని కలిపి కొడితే ఆ కిక్కే వేరు. ఈ సూత్రాన్ని దర్శకులు బాగా ఆకళింపు చేసుకున్నారు. తాజాగా వస్తున్న 'ఒక్కడినే' చిత్రం కోసం రచనామౌర్య చేసిన ఐటం సాంగ్ అదరకొడుతోంది.


గులాబీ మూవీస్ పతాకంపై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఒక్కడినే'. నారా రోహిత్ హీరో. నిత్యామీనన్ హీరోయిన్. ఈ చిత్రం కోసం సాహితి రాసిన 'పుట్టింటోళ్ళు తరిమేశారు. కట్టుకున్నోడు వదిలేశాడు' అంటూ సాగే గీతాన్ని చిత్రీకరించారు. ఈ పాటలో రచనామౌర్య రెచ్చిపోయి నటించింది. తన అందచందాలను అర్దనగ్నంగా చూపటంలోనూ ఎక్కడా రాజీపడలేదు.

ఈ పాటలో రచనా మౌర్యతో పాటు 12 మంది అబ్బాయిలు, 70 మంది మోడల్స్ ఇందులో నటించారు. భాను మాస్టార్ నృత్య దర్శకత్వం వహించారు. సినిమా హైలెట్స్ లో ఒకటిగా ఈ పాట నిలుస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఈ పాటలోని కొన్ని స్టిల్స్ ని విడుదల చేసారు. అవి మీ కోసం..

నారా రోహిత్ హీరోగా గులాబీ మూవీస్‌ పై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఒక్కడినే'. ‘ఒక్కడినే' చిత్రం ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు.

నిత్యామీనన్ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె పాత్ర సినిమాకు ప్రాణం అంటున్నారు.

ఈ చిత్రంలో కథ...సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ..వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్‌ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది.

ఈ కథ గురించి నిర్మాత సివీ రెడ్డి మాట్లాడుతూ...ప్రేమంటే రెండు మనసుల కలయిక. నిదురలోనైనా, మెలకువలోనైనా... ఆ మధురమైన జ్ఞాపకాలే తోడుగా ఉంటాయి. ప్రేమ మొగ్గ తొడిగిందంటే ఒంటరి జీవితానికి వీడ్కోలు పలికిట్టే లెక్క. కానీ ఓ యువకుడికి మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ప్రేమలోపడిన తరవాతే అతను ఒంటరిగా మిగిలాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు.

మా దర్శకుడు శ్రీనివాస్‌ రాగ ఎక్కడా, దేనికీ రాజీపడకుండా చిత్రీకరించారు. తప్పకుండా ఇది ఇంటిల్లిపాది మెచ్చేటువంటి అపురూప కథా చిత్రం అవుతుందని నా నమ్మకం.

ఈ సినిమాపై అంచనాలు అదికంగా బాగా ఉన్నాయి. దీనికి కారణం నారా రోహిత్ చేసిన ‘సోలో', నిత్యామీనన్ తాజాగా నటించిన ‘ఇష్క్' చిత్రాలు. ఈ రెండూ విజయవంతం కావడం, వాటిల్లోని హీరో, హీరోయిన్లు కలిసి తొలిసారి ఇందులో జంటగా నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

టైటిల్‌కు తగ్గ కథ ఇది. చక్కని లవ్ డ్రామా ఉంది. ఇప్పటికే మార్కెట్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చినట్లు చెప్తున్నారు.

ఈ చిత్రంతో తాను కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు నారా రోహిత్ ప్రయత్నిస్తున్నారు. నిత్యా మీనన్ ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

ఇది ఇంటిల్లిపాదీ కలిసి చూసి ఆనందించే కథాచిత్రం. ఫ్యామిలీ అనుబంధాల తీవ్రతను ఓ కొత్త కోణంలో చెబుతున్నాం. దర్శకుడు చక్కగా తెరకెక్కించారు అన్నారు నారా రోహిత్.

నిత్యామీనన్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగులో మరోసారి పూర్తి స్ధాయి గుర్తింపు తెచ్చే చిత్రం అవుతుందని చెప్తోంది.

నారా రోహిత్‌ సరసన నిత్యామీనన్‌ నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, చంద్రమోహన్‌, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, యం.యస్‌.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి ముఖ్యపాత్రల్ని చేసారు.

See next photo feature article

ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్‌, ఛాయాగ్రహణం: ఆండ్రుబాబు, కళ: నాగేంద్ర, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కో-డైరెక్టర్‌: కళ్యాణ్‌, ప్రొడక్షన్‌: తాండవకృష్ణ పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు. నిర్మాత: సి.వి.రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్‌ రాగ.

Read more about: nara rohit, solo, okkadine, నారా రోహిత్, సోలో, ఒక్కడినే
English summary
Rachana Maurya is a Indian Film Actress and Model. She Mainly appears in Item numbers for Indian Movies. Rachana Mourya item song in Nara Rohit Upcoming flick Okkadine.Telugu Old hit “Puttintollu Tharimesaaru…” item song did by Jayamalini .Rachana shake her belly for this item song. Special set was ready in Ramoji Film Ciry for this song.70 side dancers are dance along with Rachana Mourya.Srinivas Raga directing this movie and Nitya Menon female lead in Okkadine movie.
Please Wait while comments are loading...