»   » శివ‌లింగ‌‌: ట్రైలర్ చూస్తూంటే మళ్లీ లారెన్స్‌ తెలుగులో దుమ్మురేపేటట్లున్నాడే!!

శివ‌లింగ‌‌: ట్రైలర్ చూస్తూంటే మళ్లీ లారెన్స్‌ తెలుగులో దుమ్మురేపేటట్లున్నాడే!!

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కొరియోగ్రాప‌ర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం శివ‌లింగ‌.రితిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన క‌న్న‌డ సూప‌ర్‌హిట్ మూవీ శివ‌లింగ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ విడుదలైంది.

పి.వాసు తనయుడు శక్తివాసు కీలక పాత్రలో నటించారు. 'చంద్రముఖి'లా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. 'ఈ ఛాలెంజింగ్‌ కేసులో ఈ శివ.. శివలింగేశ్వర్‌ ఓడిపోడు బాబా' అంటూ లారెన్స్‌ చెప్తున్న డైలాగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

నిర్మాత మాట్లాడుతూ- కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది.చిత్రీకరణ పూర్తయింది.నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని అన్నారు.

రాఘ‌వ‌లారెన్స్‌, రితిక సింగ్‌, వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః ర‌మేష్‌.పి.పిళ్లై.

English summary
Raghava Lawrence, now comes back with another horror thriller ‘Shivalinga’. The movie makers released the trailer and the trailer brings the horror back on to the screen and Lawrence with his actions.
Please Wait while comments are loading...