twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఆర్ రహమానే బాధ్యుడు అంటూ నిర్మాత ప్రకటన!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘ఐ' చిత్రం విడుదల కోసం సౌతిండియా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనే ఉద్దేశ్యం కొన్ని రోజుల క్రితం ట్రైలర్ కూడా విడుదల చేసారు. అప్పటి నుండి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు షాకిస్తూ....ఈ చిత్రాన్ని వాయిదా వేసారు.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల ఇంత ఆలస్యం కావడానికి కారణం....సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రీ రికార్డింగు పూర్తి కాక పోవడమే అంటున్నారు నిర్మాత. రీ-రికార్డింగ్ అదిరిపోవాలనే పట్టుదలతో రహమాన్ ఉన్నారు. అందుకని ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ చిత్రం విడుదలలో జాప్యం జరగడానికి ఇదే కారణం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేస్తాం'' అని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ పేర్కొన్నారు.

    Rahman delays Shankar's 'I' release

    గత కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం ఆడియో వేడుక చెన్నైలో గ్రాండ్ గా విడుదల చేసారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దాదాపు 2 సంవత్సరాలకు పైగా షూటింగ్ జరుపుకున్న ‘ఐ' చిత్రం సెప్టెంబర్ 24 షూటింగ్ పూర్తయింది.

    ఈ చిత్రంలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఐ' సినిమాలో మూడు గెటప్స్ లో కనపడతాను. సినిమా మోడలింగ్ ఫీల్డ్ కి సంబంధించిన పాయింటతో రూపొందింది. మోడలింగ్ రంగంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడనేదే కోణంలో సినిమా ఉంటుంది. శంకర్ స్టయిల్ లో సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి ఫీలవుతారు అన్నారు.

    English summary
    When asked the reason for the delay in the 'I' film's release, producer Aascar Ravichandran said AR Rahman was still working on the background score of the film and would complete it in the next few days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X