twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్జీవీ ‘రాయ్’ లుక్ కేక: ప్రారంభోత్సవంలో రియల్ డాన్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దాసరి కిరణ్ కుమార్ సమర్పణలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్(ఎం.ఎల్.సి) నిర్మాతగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'రాయ్'.

    కోర్టులో ఒక్క మర్డర్ కేసు తేలడానికి 20 ఏళ్ల సమయం పడుతుంది. కానీ అతను 20 మర్డర్ కేసుల నుండి 21 నెలల్లో బయటపడిపోయాడు. రూ. 30తో మొదలు పెట్టి, 30 ఏళ్ల క్రిమినల్ కెరీర్లో రూ. 30వేల కోట్లు సంపాదించాడు. నేరస్తుడు జీవితం చీకటి అని చరిత్ర చెబుతుంది. కాదు వేయి సూర్యుల వెలుగు అని అతను నిరూపించాడు. అలాంటి నేరాల తర్వాత కూడా అతనికి నేడు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతేడే 'రాయ్' అంటూ ఈచిత్రానికి సంబంధించి స్టోరీని ఒక్క ముక్కలో చెప్పాడు వర్మ. ఈ చిత్రంలో రాయ్ జీవితంలో గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని చూపెట్టబోతున్నారు.

    గ్యాంగ్ స్టర్ ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మే 1న బెంగళూరు బిదాడిలో అభిమానులు మధ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముత్తప్పరాయ్, రామ్ గోపాల్ వర్మ, వివేక్ ఒబెరాయ్, సి.ఆర్.మనోహర్, దాసరి కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

    కార్యక్రమానికి...రియల్ డాన్ ముత్తప్పరాయ్ కూడా హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా ముత్తప్ప రాయ్ యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. 55 కోట్ల భారీ బడ్జెట్ తో లండన్, దుబాయ్, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించనున్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

    ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను వేవ్ ఫిలింస్ అధినేత రాజు చద్దా, ఈరోజ్ ఇంటర్రేషనల్ సునీల్ లుల్లా కైవసం చేసుకున్నారు. అలాగే తమిళ హక్కులను సౌతిండియా ఫిలించాంబర్ అధ్యక్షుడు గంగరాజు ఫ్యాన్సీ చేటు చెల్లించి సొంతం చేసుకున్నారు.

    రాయ్ మూవీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రియల్ డాన్ ముత్తప్ప రాయ్ తో పాటు సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

    రాయ్ మూవీ ప్రారంభోత్సవం

    రాయ్ మూవీ ప్రారంభోత్సవం


    రాయ్ మూవీ ప్రారంభోత్సవంలో రామ్ గోపాల్ వర్మ, వివేక్ ఒబెరాయ్, ముత్తప్పరాయ్, దాసరి అరుణ్ కుమార్ తదితరులు...

    ఫస్ట్ లుక్

    ఫస్ట్ లుక్


    రాయ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్...

    రియల్ డాన్ తో కలిసి..

    రియల్ డాన్ తో కలిసి..


    రియల్ డాన్ ముత్తప్ప రాయ్ తో కలిసి వర్మ, వివేక్ ఒబెరాయ్.

    ఇతడే రియల్ డాన్ ముత్తప్ప రాయ్

    ఇతడే రియల్ డాన్ ముత్తప్ప రాయ్


    ముత్తప్ప రాయ్ ఇతడే. ఇతడి జీవితం ఆదారంగానే వర్మ ‘రాయ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

    అభిమానులు

    అభిమానులు


    నేరస్తుడు అయినా...రాయ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు.

    వివేక్ ఒబెరాయ్

    వివేక్ ఒబెరాయ్


    తొలుత ఈచిత్రాన్ని కిచ్చా సుదీప్ తో చేయాలనకున్నాడు వర్మ. కానీ చివరకు వివేక్ ఒబెరాయ్ ని ఫిక్స్ చేసాడు.

    English summary
    Photos of Rai Movie Mega Launch event held at Bangalore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X