twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేం చేసిన తప్పేంటి? ‘బాహుబలి-2’ను అడ్డుకోవడం దారుణం: రాజమౌళి

    కన్నడ సంఘాలు చేస్తున్న ఆందోళనపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. మాకు సంబంధం లేని విషయంలో మా బాహుబలి 2 సినిమాను అడ్డుకుంటామని అనడం విచారకరమన్నారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాహుబలి-2' సినిమాను అడ్డుకుంటామని, కర్నాటకలో ఈ సినిమాను రిలీజ్ కానివ్వబోమంటూ కన్నడ సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం కావేరీ జలవివాదం. బాహుబలి-2 మూవీలో నటించిన సత్యరాజ్ ఈ వివాదానికి సంబంధించి గతంలో కన్నడిగులను అవమానించే విధంగా కామెంట్స్ చేసారని, ఇపుడు ఆయన క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయన నటించిన బాహుబలి-2 సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ నాయకులు హచ్చరించారు.

    ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28 వ తేదీన బాహుబలి-2 సినిమా విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలోపు సత్యరాజ్ క్షమాపణ చెప్పకపోతే ఏప్రిల్ 28వ తేది బెంగళూరు బంద్ నిర్వహిస్తామని కన్నడ సంఘాల సమాఖ్య సంచాలకుడు వాటాళ్ నాగరాజ్ ప్రకటించారు.

    ఈ వివాదంపై రాజమౌళి స్పందన

    ఈ వివాదంపై రాజమౌళి స్పందన

    ఈ వివాదంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. మాకు సంబంధం లేని విషయంలో మా బాహుబలి 2 సినిమాను అడ్డుకుంటామని అనడం విచారకరమన్నారు. సత్యరాజ్ 9 సంవత్సరాల ముందు ఏవో కామెంట్స్ చేస్తే ఇపుడు ఆందోళన చేయడం దారుణమన్నారు.

    ఆ వివాదం గురించి తెలియదు

    ఆ వివాదం గురించి తెలియదు

    మాకు ఆ వివాదానికి సంబంధించిన విషయాలేవీ తెలియవు. మాకు సంబంధం లేని విషయం. తమిళం పూర్తి స్థాయిలో రాదుకాబట్టి ఆయన ఏం మాట్లాడారో కూడా తెలియదు. ఆయన వ్యాఖ్యల్లో కన్నడిగులకు ఉన్న అభ్యంతరం ఏమిటో తెలియదు.... అని రాజమౌళి అన్నారు.

    ఇన్నాళ్లూ లేని గొడవ ఇప్పుడెందుకు?

    ఇన్నాళ్లూ లేని గొడవ ఇప్పుడెందుకు?

    9 ఏళ్ల క్రితం ఆయన కామెంట్స్ చేసిన తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. బాహుబలి పార్ట్ 1 కూడా రిలీజైంది. అప్పుడు ఎలాంటి వివాదం లేదు. ఇపుడు సడెన్ గా తెరపైకి వివాదం రావడం విచారకరమని రాజమౌళి అన్నారు.

    చాలా సెన్సిటివ్ ఇష్యూ

    చాలా సెన్సిటివ్ ఇష్యూ

    ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ... ఆ వివాదం గురించి ఎలా స్పందించాలో కూడా తెలియదు. మౌనంగా ఉండాలో తెలియదు, ఏదైనా మాట్లాడాలో తెలియదు. సత్యరాజ్ ఈ సినికు దర్శకుడు కాదు, నిర్మాత కాదు, హీరో కూడా కాదు.... ఓ పాత్ర చేసాడు అంతే. ఈ వివాదంలో ఏం చేయాలో తెలియని అయోమయంలో మేమంతా ఉన్నామని దర్శకుడు రాజమౌళి అన్నారు.

    క్షమాపణ చెప్పిస్తే అక్కడ సమస్యత

    క్షమాపణ చెప్పిస్తే అక్కడ సమస్యత

    ఒక వేళ సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణ చెబితే తమిళనాడులో ఆయనకు కావేరి సెగ తగులుతోంది. బాహుబలి-2 (తమిళ్, తెలుగు, హిందీ) సినిమాను తమిళనాడులో అడ్డుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

    English summary
    Baahubali: The Conclusion is set for a worldwide release on April 28th.Unfortunately just before the movie hits theatres, it found itself in controversy because of Kattappa's statement over the Cauvery issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X