twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్ : మహేష్ తో చిత్రం గురించి రాజమౌళి వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో చిత్రం గురించి అభిమానులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఆ క్షణాలు రానే వస్తున్నాయి. రాజమౌళి ఈ విషయమై ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు. తన తాజా చిత్రం బాహుబలి ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై వివరణ ఇచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రాజమౌళి మాట్లాడుతూ..."నేను, మహేష్ బాబు కలిసి నిర్మాత కె.ఎల్ నారాయణ గారు కోసం ఎప్పుడో సైన్ చేసాము. అయితే వేరే కమిట్ మెంట్స్ తో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. బాహుబలి 2 పూర్తవగానే నేను ఈ చిత్రంపైనే దృష్టి పెడతాను. మరో సంవత్సరం పడుతుంది మహేష్ తో చిత్రం చేయటానికి " అని వివరించారు.

    Rajamouli-Mahesh movie on cards

    అలాగే...‘మహేష్ బాబుతో సినిమా ఎప్పుడో ఖరారు అయ్యింది. దానికి సంబందించిన అగ్రిమెంట్ పనులు కూడా పూర్తయ్యాయి. కెఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా కోసం మహేహ్స్ బాబు ఎప్పుడో సైన్ చేసాడని' తెలిపాడు.

    మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆగష్టు 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే మహేష్ బాబు మరో చిత్రం బ్రహ్మోత్సవం కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాబట్టి ఈ రెండూ పూర్తైన తర్వాతే మహేష్ తో చిత్రం ఉండే అవకాసం ఉంది.

    'శ్రీమంతుడు' విశేషాలకు వస్తే...

    ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

    Rajamouli-Mahesh movie on cards

    ఇంకా ఆడియో కూడా రిలీజ్ కాని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో గట్టి పోటీ నెలకొందట. ఫైనల్‌గా ‘శ్రీమంతుడు' శాటిలైట్ రైట్స్‌ని సుమారు 10 కోట్ల రూపాయలకి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ మంతుడుకి సంబందించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాలోని నటీ నటుల డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వారిది ముగియగానే మహేష్ బాబు తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేస్తారు.

    మరో ప్రక్క ఈ చిత్రంలో మహేష్ వాడే సైకిల్ ఖరీదు ఎంత ఉండవచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ సైకిల్ ఖరీదు... మూడున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ సైకిల్... Canondale కంపెనీవారి Scalpel 29 మోడల్ లో త్రీ ఫ్రేమ్ కార్బన్ అని తెలుస్తోంది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఈ సైకిల్ ఖరీదు... అక్కడ 5500$ అంటున్నారు. మహేష్ ఓ మిలియనీర్ అని ఈ సైకిల్ తో దర్శకుడు చెప్పాడంటున్నారు.

    ఇక ఈ చిత్రంతో మహేష్‌బాబు నిర్మాతగా మారారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' సినిమాతోనే మహేష్‌ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

    Rajamouli-Mahesh movie on cards

    'శ్రీమంతుడు' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

    మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

    శ్రీమంతుడు విడుదల తేదీని...బాహుబలి రిలీజ్ గురించి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇఫ్పటికే ...బాహుబలి నిర్మాత ధాంక్స్ చెప్పారు. అలాగే శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ సైతం మాట్లాడారు. ఈ నేపధ్యంలో ఈ విషయమై రాజమౌళి సైతం వివరణ ఇచ్చారు.

    రాజమౌళి మాట్లాడుతూ... మా తరపు నుంచి జరిగిన పొరపాటేమిటంటే.. మా సినిమా విడుదల చెయ్యాలంటే తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ వెర్షన్లు కూడా చూసుకోవాలి. కర్ణాటకలోనూ అక్కడి సినిమాలు ఏం విడుదలవుతున్నాయో కూడా చూసుకోవాలి. అన్ని ఏరియాలూ చూసుకొని, జూలై 10 మంచిదనుకొని ప్రకటించాం.

    అప్పటికే ‘శ్రీమంతుడు'ను వాళ్లు జూలై 17న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారనే విషయం ఆ తర్వాతే మాకు తెలిసింది. దాంతో ‘ఇలా జరిగిందేమిటబ్బా' అనుకున్నాం. నిజానికి మాకు వేరే చాయిస్‌ లేదు. వాళ్ల విడుదల తేదీ మాకు తెలిసినా, మా ఇబ్బంది వాళ్లకు చెప్పి, వాళ్లచేత ఆ పనే చేసుండేవాళ్లం. లక్కీగా వాళ్లకు కూడా పని పూర్తికాలేదు.

    వాళ్లకు ఫస్ట్‌కాపీ రెడీగా ఉన్నట్లయితే, మాకు పెద్ద సమస్య అయ్యుండేది. వాళ్లదీ పెద్ద సినిమా. ఈ నెలాఖరు దాకా షూటింగ్‌ ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి కావాల్సి ఉంది. వాళ్లకూ కనీసం ఒకటిన్నర నెల టైమ్‌ కావాలి. అలా మాకు కలిసొచ్చింది. వాళ్లు కూడా మా పరిస్థితి అర్థం చేసుకుని, వారి సినిమాని పోస్ట్‌పోన్‌ చేసుకున్నారు. బయట ఎన్ననుకుంటున్నా, అంతర్గతంగా వాళ్లూ మేమూ మాట్లాడుకుంటూనే ఉన్నాం అని చెప్పుకొచ్చారు.

    English summary
    Rajamouli said: “Me and Mahesh have signed a movie with producer KL Narayana long back. Somehow due to our past commitments, this film is not materialising. Seriously after wrapping Baahubali 2, I’ve to think about this movie. It may take 1 more year to make a movie with Mahesh”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X