twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ కూడా రాజమౌళినే వరించింది,కంగ్రాంట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళికి మరో అవార్డ్ వచ్చింది. సీఎన్ఎన్ ఐబీఎన్ సంస్థ ప్రతీ సంవత్సరం నిర్వహించే 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో 2015 సంవత్సరానికి రాజమౌళి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

    పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజమౌళి ఈ పురస్కారానికి నామినేట్ అయి అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన్ను ఆ నేషనల్ ఛానెల్ వారు విజనరీగా అభివర్ణించింది.

    రణవీర్ సింగ్, కంగనారనౌత్ లకు ఎంటర్ట్నైమెంట్ విభాగంలో స్పెషల్ కేటగిరీలో అవార్డ్ లు వరించాయి. ఇండియన్ ఆఫ్ ది ఇయిర్ 2015 అవార్డ్ చెన్నైకు చెందిన వ్యక్తికి వెళ్లింది. ఢిల్లీ వెళ్లి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల సమక్షంలో జరిగిన వేడుకలో రాజమౌళి ఈ అవార్డు స్వీకరించారు.

    Rajamouli named Indian of the Year (Entertainment)

    రాజమౌళి మాట్లాడుతూ.. "ఈ పేరు మొత్తం బాహుబలి టీమ్ కే చెందుతుంది. వారు ఎంతో కష్టపడితేనే ఇప్పుడు నాకు ఈ స్థాయి పేరొచ్చింది. ఈ అవార్డును నా టీమ్‌కు అంకితం ఇస్తున్నా" అని తెలిపారు.


    అలాగే ...అందరినీ వేధిస్తున్న 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడూ?' అన్న ప్రశ్నకు, ఆ సమాధానం కోసం పార్ట్ 2 వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే అంటూ సరదాగా సమాధానమిచ్చారు.

    రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'బాహుబలి' సినిమా ఆయన కీర్తిని, వైభవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దర్శకుల జాబితాలో రాజమౌళి కూడా చేరిపోయారు.

    Rajamouli named Indian of the Year (Entertainment)

    అలాగే 2015 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా 'బాహుబలి' ఎంపికవ్వడం ఆయనకు ఓ ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి మరోసారి దేశవ్యాప్తంగా తన ప్రత్యేకత చాటుకుంటూ 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారానికి ఎంపికవ్వటం ఆయన అభిమానులకే కాక,సిని ప్రేమికులకూ ఆనందకరమైన విషయమే. ఈ సందర్బంగా వన్ ఇండియా తెలుగు రాజమౌళికి మరోసారి మనస్పూర్తిగా శుభాకాంక్షలు,అభినందనలు తెలియచేస్తోంది.

    English summary
    S S Rajamouli was declared as Indian of the Year in the entertainment category by CNN-News18 for year 2015. CNN-News 18’s Indian of the Year 2015 awards were given to the winners on June 9th, 2016 at a glittering ceremony in New Delhi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X