twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' ఆడియో లో పాటలు ఎన్ని..ఛీఫ్ గెస్ట్ ఎవరు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలోని తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో జులై 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపధ్యంలో చిత్రం ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఆడియోకు సంభందించిన ఆసక్తికరమైన విశేషాలు బయిటకు వచ్చాయి. వీటిని కీరవాణి గారే రివిల్ చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రాజమౌళి సోదరుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందించిన ‘బాహుబలి' మొదటి పార్ట్ ఆడియోలో మొత్తం 8 పాటలు ఉండనున్నాయి. టాలీవుడ్ లో పేరున్న ఏడు గురు లిరిక్ రైటర్స్ ఈ 8 పాటలని రాసారు. ఈ నెల 31న జరగనున్న ఈ ఆడియో లాంచ్ భారీ గా జరగనుంది. దాదాపు కోటి రూపాయలు దాకా ఈ లాంచ్ కే ఖర్చు పెడతారని చెప్పుకుంటున్నారు.

    'బాహుబలి' పాటల్ని లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ మొత్తానికి 'బాహుబలి' తెలుగు, తమిళ పాటలకు సంబంధించిన హక్కుల్ని లహరి మ్యూజిక్‌ సంస్థ చేజిక్కించుకొంది. ఇండస్ట్రీలో చెప్పుకునేదాని ప్రకారం ఈ చిత్రం ఆడియో రైట్స్ మూడు కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకూ ఏ చిత్రం ఆడియోకు ఈ రేటు పలకలేదు.

    Rajamouli's Baahubali Audio Album with eight songs
    ''భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే 'బాహుబలి' సినిమా పాటల్ని మా సంస్థ ద్వారా విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది''అన్నారు లహరి మ్యూజిక్‌ అధినేత జి.మనోహర్‌నాయుడు.

    ఈ చిత్రం ఆడియోని శిల్ప కళా వేదికలో నిర్వహిస్తున్నారు. తెలుగు,తమిళ, బాలీవుడ్ చిత్రాలకు చెందిన ఇండస్ట్రీ ప్రముఖులు ఈ పంక్షన్ లో పాల్గొననున్నారు. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...రజనీకాంత్ హాజరయ్యే అవకాసం ఉంది. అలాగే బాలీవుడ్ లో డైరెక్టర్ గా, నిర్మాతగా, సక్సెఫుల్ రియాలిటీ షో హోస్ట్ గా, తాజాగా నటుడిగా మారిన కరణ్ జోహార్ ముఖ్య అతిధిగా రానున్నాడు.

    ఇక ఈ ఆడియో ఆల్బమ్ వివరాల్లోకి వెళితే...

    ఇక ఈ ఆడియోని రాజమౌళి సోదరుడు కీరవాణి అందించారు.పాటలను శివశక్తి దత్తా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, చైతన్య ప్రసాద్, ఇనగంటి సుందర్, ఆదిత్య, నీల్ సీన్ రాసారు.

    ఇక పాటలు పాడింది...గీతా మాధురి, దీపు, రమ్య బెహ్రా, మోహన, కార్తీక్, దామిని, సత్య యామినీ, శ్వేత రాజ్, మౌనిమ, రేవంత్, ఆదిత్య, కీరవాణి (సంగీత దర్శకుడే) పాడారు.

    ప్రభాస్‌ హీరో. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ముఖ్యభూమిక పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ నెల 31న ట్రైలర్‌ని విడుదల చేస్తారు. భల్లాలదేవ పాత్రలో నటించిన రానా ప్రచార చిత్రాన్ని బుధవారం రాజమౌళి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. సినిమాలో రానా విలన్ గా నటించిన విషయం తెలిసిందే. క్రూరుడైన ఓ రాజుగా ఆయన తెరపై సందడి చేయబోతున్నారు.

    భల్లాలదేవ... ఓ యువరాజు. ఆయన శక్తికి తిరుగన్నదేలేదు. బలానికి పోలికే లేదు. అతడి ఆలోచనలను చదవడం ఎవ్వరివల్లా కాదు. అతడి విజృంభణ ఎలా ఉంటుందో తెరపైనే చూడాలంటున్నారు.

    మరో ప్రక్క పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. తెలుగు నాట ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ హక్కులు కూడా అమ్ముడయిపోయాయి. ప్రభాస్‌తో ‘మిర్చి', శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌' చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ తమిళనాడుకు చెందిన స్డూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ తమిళ వెర్షన్‌ హక్కులు సుమారు రూ.25 కోట్లు పలికినట్లు కోలీవుడ్‌ సమాచారం.

    English summary
    Rajamouli's Baahubali - The Beginning, is readying for grand audio and trailer launch on May 31st. According to the latest music director Keeravani revealed the details of the Baahubali audio.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X