»   »  'బాహుబలి' : రిలీజ్ డేట్ పోస్టర్స్

'బాహుబలి' : రిలీజ్ డేట్ పోస్టర్స్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కేవలం తెలుగు సినిమా వాళ్లే కాకుండా... యావత్‌ భారత చిత్ర పరిశ్రమ విడుదల రోజు కోసం ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న చిత్రం 'బాహుబలి'. దానికి అభిమానుల ఉత్సాహాన్ని , ఎదురుచూపులుని మరింతగా పెంచటానికి ప్రమోషన్స్ సైతం పెంచేసారు. రోజుకో రకమైన సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా చేసే ప్రమోషన్ తో మతిపోయేలా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ న్స్ విడుదల చేసారు. ఆ పోస్టర్స్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రానికి సంబంధించి ఏ అంశం విడుదల చేసిన అమితాసక్తి గొలుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లు, చిత్రంలోని పాత్రల పరిచయాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ పోస్టర్స్ కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అభిమానుల ఆదరణ పొందుతున్నాయి.


దానికి తోడు రీసెంట్ గా... ‘చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసితీరా ఈ చేతుల్తో చంపాలని నేనూ..' అని రానా చెప్తూంటే... అనుష్క...‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. బాహుబలి తిరిగొచ్చాడు!' అంటూ రీసెంట్ గా ఓ డైలాగు ట్రైలర్ వదిలి అదరకొట్టారు. దానితో మరింతగా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి.


స్లైడ్ షోలో కొత్త ఫొటోలు...


డిఫెరెంట్ లుక్ తో .

 


ఈ పోస్ట్రర్స్ లో ప్రభాస్ ఇప్పటివరకూ కనపడని కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్నాడు


 


అదిరేలా

 


కీలకమైన మరో పాత్రలో కనిపించే రానా కర్కసమైన చూపులతో కన్పిస్తూ భయపెడుతున్నాడు


 


యోధుడుగా...

 


బాహుబలిగా కదన రంగానికి సిద్ధమైన యోధుడిగా ఈ చిత్రంలో కనువిందు చేస్తున్నాడు. అది పోస్టర్స్ లో ప్రతిఫలిస్తోంది


 


ప్రభాస్ హైలెట్

 


ప్రభాస్‌ శివుడిగా సిక్స్ ప్యాక్ బాడీతో , మెడలో శివలింగంతో ఉండి ఉత్సుకత పెంచుతున్నాడు


 


రెండు పాత్రలూ

 


ప్రభాస్ రాజసం ఉట్టిపడుతూ తన దైన శైలిలో ప్రభాస్..అలాగే యోధుడుగానూ రెండు పాత్రలలోనూ


 


భారీగా

 


దాదాపు రూ: 200కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందిన 'బాహుబలి' గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకొంటోంది


 


సెన్సార్ పూర్తి

 


ఇప్పుడీ చిత్రం సెన్సార్ పనులను పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని అందుకుంది. దీంతో సినిమాకు సంబందించిన కార్యక్రమాలు దాదాపు పూర్తి అయినవట్లే...


 


హాలీవుడ్ సైతం...

 


ప్రచార చిత్రాల్ని చూసి అందులోని సాంకేతికత గురించి హాలీవుడ్‌ సైతం చర్చించుకొంటోంది .


 


భారతీయభాషల్లో...

 


తెలుగు,తమిళ, హిందీ,మళయాళ భాషల్లో విడుదల చేయటానికి రెడీ చేస్తున్నారు.


 


సబ్ టైటిల్స్..

 


ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రేక్షకుల కోసం ఈ చిత్రంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


 


English summary
Indian’s biggest motion picture Baahubali is gearing up for a Grand worldwide release as never seen before in 4000+ locations on July 10th.
Please Wait while comments are loading...