twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శివుడు' తో తమన్నా రొమాన్స్...పాట

    By Srikanya
    |

    హైదరాబాద్: బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో సాబుసిరిల్‌ రూపొందించిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రభాస్‌, తమన్నాలపై పాటను చిత్రీకరిస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ప్రేమ్‌రక్షిత్‌ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని వేసవిలో విడుదల చేస్తారు. ఇది కాకుండా మరో పాట చిత్రీకరిస్తే తొలి భాగం పూర్తవుతుంది. ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు.

    ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తీర్చిదిద్దుతున్న ప్రతిష్ఠాత్మకమైన చిత్రం 'బాహుబలి'. ఒకటిన్నర సంవత్సరం నుంచి విరామం లేకుండా చేస్తున్న చిత్రీకరణ చివరి దశకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులే కాక సినిమా లవర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ ని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వంద సెకండ్ల ట్రైలర్ ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎడిటర్స్ ... ట్రైలర్ ని తీర్చిదిద్దుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

    Rajamouli's Bahubali in song shoot

    మరో ప్రక్క ఆ మధ్యన విడుదల చేసిన 'విజువలైజింగ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ బాహుబలి' వీడియోకు వచ్చిన స్పందన పట్ల యూనిట్ సంతోషంగా ఉంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు.

    ప్రభాస్‌, అనుష్క , తమన్నా, రానా, సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బాహుబలి'. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం పుస్తకం రెడీ చేస్తున్నారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ పుస్తకంలో చిత్రం మేకింగ్ గురించి ఉంటుందని చెప్పుకుంటున్నారు. చిత్రం కోసం వేసిన స్కెచ్ లు, షూటింగ్ విశేషాలతో ఈ పుస్తకం సిద్దం చేస్తున్నట్లు వినికిడి. సినీ లవర్స్ కు ఈ పుస్తకం మంచి గిప్టే మరి.

    సినిమా షెడ్యూల్‌ గురించి వివరిస్తూ ‘‘సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ప్యాచ్‌వర్క్‌, మైనర్‌ టాకీ, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. తాజా షెడ్యూల్‌ఆదివారం రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. 2015 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్‌, సంగీతం: యం.యం.కీరవాణి.

    ఆ మధ్యన నిర్మాతలు విడుదల చేసిన సినిమా స్టిల్‌లో ప్రభాస్‌ను చూస్తే టైటిల్‌కు సంపూర్ణ న్యాయం చేస్తున్నవాడిలా కనిపించాడు. వీరయోధుడి దుస్తుల్లో, రెండు చేతుల్లో ఆయుధాలతో, కండలు తిరిగిన దేహంతో ఉన్న ప్రభాస్‌ రూపానికి నిజంగానే విశేషమైన స్పందన వచ్చింది.

    Rajamouli's Bahubali in song shoot

    మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.

    రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫోని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... వాట్స్ అప్ యాప్ లో దొరుకుతుందని చెప్తున్నారు. ఈ మేరకు 809675522 నెంబర్ ని విడుదల చేసారు. ఈ నెంబర్ ని మీరు వాట్సప్ లో యాడ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు చిత్రం గురించి ఎక్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.

    ఇక ...

    కవచాలు, శిరస్త్రాణం ధరించి, కరవాలం చేతపట్టి యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడే యోధుడిగా ప్రభాస్‌ తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. 'మేకింగ్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో ఇప్పటికే పలు వీడియోలను చిత్రం బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

    'బాహుబలి' గా ప్రభాస్‌ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.

    రాజమౌళి కొత్త ఆలోచన:

    లైవ్‌ యాక్షన్‌ సినిమా, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత సినిమా.. ఈ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. కెమెరా ముందు జరుగుతున్న సన్నివేశాన్ని యథాతథంగా చూపించడం లైవ్‌ యాక్షన్‌ సినిమా. ఖాళీ ప్రదేశంలో బ్లూమేట్‌ ముందు చిత్రీకరించి ఆ తర్వాత దానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి ఏ పెద్ద కోట లోపలో, లేదా కోట ముందో ఉన్నట్లు చూపించడం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత చిత్రమవుతుంది. రెండో రకం చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురుగా ఏమీ లేకుండానే ఉన్నట్లు భావించి నటించాల్సి వస్తుంది.

    ఇలాంటి సన్నివేశాలకు దర్శకత్వం వహించడం కష్టసాధ్యమైన పనే. అందుకే బ్లూమేట్‌ ఆధారంగా తీసే సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే కళ్లకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కనపడేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి. ఆయన తాజా చిత్రం 'బాహుబలి' కోసం ఏఎండీ అనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థతో కలసి పని చేస్తున్నారు. ఈ పనిలో మరో సంస్థ మకుట కూడా పాలుపంచుకుంటోంది. ఏఎండీ తాజాగా ఓ మైక్రోచిప్‌ తయారు చేసే పనిలో ఉందట.

    ఓ చిప్‌లో మొత్తం ఎఫెక్ట్స్‌ను అప్‌లోడ్‌ చేసి దాన్ని కళ్లజోడుకు జోడించి చూస్తే బ్లూమేట్‌ మీద ఏమైతే విజువల్‌ ఎఫెక్ట్స్‌ని మిక్స్‌ చేస్తారో.. అవి కనిపిస్తాయి. దీని వల్ల చిత్రీకరణ సులభతరమవుతుంది. రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి రూపొందించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

    English summary
    Prabhas 's Bahubali directed by Rajamouli is nearing completion. Filmmakers are canning song on Prabhas and Tamanna in a specially laid set by art director Sabu Cyril.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X