» 

రాజన్ పి.దేవ్ మృతి

తెలుగులో ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన మళయాళ నటుడు రాజన్.పి.దేవ్ ఈ రోజు (బుధవారం)ఉదయం కొచ్చిన్ లో మరణించారు. లివర్ సమస్యతో గత కొద్ది రోజులుగా లేక్ షోర్ హాస్పటిల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాజన్ పి.దేవ్ వయస్సు 58 సంవత్సరాలు. ఎనభైల్లో విలన్ గా సినిమాల్లో ప్రవేశించిన ఆయన తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో దాదాపు 142 చిత్రాల వరకూ వరకూ నటించారు. స్టేజ్ ఆర్టిస్టు గా 1970లో 'Kattukuthira'అనే హిట్ నాటకంలో ఆయన నట జీవితం ప్రారంభమైంది. అందులోని కొచ్చు వాల అనే పాత్ర ఆయనకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఆ నాటకం దాదాపు వెయ్యి ప్రదర్శనలు పూర్తి చేసుకుని రాజన్ ని సినిమా వారి దృష్టిలో పడేలా చేసింది. ఆయన విలన్ గా నటించిన చివరి చిత్రం ముమ్ముట్టి హీరోగా చేసిన Ee Pattanathil Bhootham.అది ఇప్పడు కేరళ ధియోటర్స్ లో హిట్ టాక్ తో రన్ అవుతోంది.అలాగే ఆయన నటుడుగానే కాక రెండు మళయాళ చిత్రాలకు సైతం దర్శకత్వం వహించారు. అవి Achamakuttiyude Achayan మరియు Achante Kochu Molku. ఆయనకు భార్య శాంత, కూతురు ఆశమ్మ, కొడుకు జూబ్లి రాజ్ ఉన్నారు. ఇక ఆయన భౌతికకాయాన్ని ఎర్నాకులంలోని టౌన్ హాల్ లో అభిమానుల సందర్శనం కోసం ఉంచారు. రేపు ఉదయం సెయింట్ జేవియర్ చర్చి మైదానంలో ఆయన అత్యక్రియంలు జరుగుతాయి. రాజన్ మృతిపై ప్రముఖ నటుడు తిలకన్ స్పందిస్తూ..రాజన్ చేసిన పాత్రలు ద్వారా ఆయన బ్రతికే ఉన్నా..ఆయన మృతి మాత్రం మళయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు గా మిగులుతుంది అన్నారు. ఖుషి, ఆది, ఒక్కడు, గుడుంబాశంకర్, ఆర్య, బాలు, బన్నీ, యోగి తదితర తెలుగు చిత్రాలలో ఆయన నటించారు. ఆయన మృతికి దట్స్ తెలుగు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది.

Read more about: rajan p dev, death, aadi, khushi, okkadu, gudumbashankar, aarya, yogi, kattukuthira, రాజన్ పిదేవ్, మృతి, కొచ్చిన్, ముమ్ముట్టి, ఖుషి, ఆది, ఒక్కడు, గుడుంబాశంకర్, ఆర్య, బాలు, బన్నీ

Telugu Photos

Go to : More Photos