twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పక్కా మాస్ మసాలాగా...(‘లింగ’ ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ :రజనీకాంత్‌ హీరోగా రూపొందిన ‘లింగ' చిత్రం ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజు అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ హీరోనే అయినా ఆయనకు తెలుగు నాట స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడా సంచలన విజయం సాధించాయి. దాంతో ఇక్కడా ఆయన సినిమాలను భారిగానే విడుదల చేస్తున్నారు. దానికి తోడు తెలుగు హీరోయిన్ అనుష్క ఉండటం కూడా సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే రీతిలో రెడీ అయ్యింది.

    తన తాతగారు రాజ లింగేశ్వర(రజనీ) కట్టిన గుడిని తిరిగి రీ ఓపెన్ చేయటానికి ఓ గ్రామం వచ్చిన లింగ(రజనీ) చుట్టూ తిరిగే కథ ఇది.అతనికి తన తాత అంటే అసహ్యం. అలాంటి వాడు తన తాతగారిని ఏక్సెప్టు చేసి ఆ గుడిని ఓపెన్ చేసే సమయంలో అనేక నిజాలు బయిటపడతాయి. అసలు తాను ఎలాంటి వంశానికి చెందిన వాడు...తను ఇలా మారటానికి కారణం ఏమిటి..ఆ గుడి ఓపెన్ వెనక ఉన్న రహస్యం ఏమిటి వంటి అనేక విషయాలతో డ్యామ్ కు ముడిపెడుతూ కథనం సాగుతుంది.

    రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘స్వాతంత్య్ర పూర్వ నేపథ్యంలో, ఓ పెద్ద డ్యామ్‌ కట్టడమనే అంశంతో తయారైన సినిమా ఇది. రవికుమార్‌ ఎక్సలెంట్‌గా తీశారు. చాలా పెద్ద స్పాన్‌ ఉన్న ఈ చిత్రాన్ని కేవలం ఆరు నెలల్లో పూర్తిచెయ్యడం అనేది గొప్ప విషయం. ‘లింగ' అందరికీ నచ్చే, అందరూ మెచ్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది'' అని చెప్పారు.

    నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘రజనీకాంత్‌గారితో సినిమా చెయ్యడం ఏడేడు జన్మల అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అంచనాలను అందుకునేవిధంగా రవికుమార్‌ దీన్ని అద్భుతంగా రూపొందించారు. మంగళవారం తమిళనాడులో అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించగా, కేవలం రెండు గంటల్లోనే రెండు వారాల వరకు థియేటర్స్‌ అన్నీ బుక్‌ అయిపోయాయి. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభించాం. ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా ట్రెమండస్‌ హిట్టవుతుందని నమ్ముతున్నా'' అని తెలిపారు.

    Rajani's Linga Preview

    బ్యానర్: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా, జగపతి బాబు,సంతానం,దేవ్ గిల్,బ్రహ్మానందం, కె విశ్వనాధ్, రాధారవి, విజయకుమార్, నిళిగళ్ రవి,కరుణాకరన్,మనోబాల, ఇలవరసు తదితరులు
    రచన: కె.ఎస్ రవికుమార్, పొన్ కుమరన్
    సంగీతం: ఎఆర్ రహమాన్
    కెమెరా: ఆర్.రత్నవేలు
    ఎడిటింగ్ : సంజీత్ మహ్మద్
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఎస్‌. రవికుమార్‌
    సమర్పణ : మునిరత్న, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మాత: రాక్‌లైన్‌ వెంకటేశ్‌
    విడుదల తేదీ : 12,12,2014

    ఎన్నో విశేషాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో రజినీకాంత్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 2000 వేలకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    English summary
    Get ready to watch Superstar Rajinikanth in action in his latest movie Lingaa right from Friday .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X