» 

రుణం తీర్చుకునేందుకే నటించా: రాజేంద్ర ప్రసాద్

Posted by:

హైదరాబాద్: తాను తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకునేందుకే ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి చిత్రాలలో నటించానని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో పాడవోయి భారతీయుడా పేరిట సచివాలయ ఉద్యోగులకు పాటల పోటీని నిర్వహించింది.

విజేతల కోసం బుధవారం అభినందన సంభ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరణించిన తరువాత కూడా జనం గుండెల్లో నిలచిన వాడే మనీషి అని రాజేంద్రప్రసాద్ అన్నారు. భూమ్మీద నుంచి మనం వెంట తీసుకెళ్లేది ఏదీ లేదు.. సాధించేది ఏదీ లేదు.. ఒక్క మంచీ.. చెడు తప్పఅన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ పద్యాన్ని పాడి అందరినీ అలరించారు.

కాగా యువతలో మార్పు తీసుకువచ్చే సందేశాత్మకమైన చిత్రం ఓనమాలు అని.. ఇలాంటి మంచి చిత్రాలను అందరూ ఆదరించి, ప్రోత్సహించాలని, జాలిపడి ఈ సినిమా చూడవద్దని రాజేంద్ర ప్రసాద్ మూడు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. తన తండ్రి ఆశీర్వాదంతోనే ఈ చిత్రంలో నారాయణ మాస్టారుగా మీ ముందుకు వచ్చానని చెప్పారు.

Read more about: rajendra prasad, onamalu, రాజేంద్ర ప్రసాద్, ఓనమాలు
English summary
Telugu cine actor Rajendra Prasad responded on Onamalu, Mee Sreyobhilashi and Onamalu films on Wednesday.
Please Wait while comments are loading...