twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ రాజకీయం: రాజేంద్రప్రసాద్ ఒంటరయ్యారా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ‌(మా) ఎన్నికల నేపథ్యంలో..... సినీ పరిశ్రమలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రెండు వర్గాల ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటూ ‘మా' అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జయసుధ వర్గానిదే పైచేయి అయినట్లు కనిపిస్తోంది.

    ‘మా' అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్ పోటీలో వెనకబడి ఉన్నట్లు, ఒంటరియినట్లు ప్రస్తుత పరిణామాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ నుంచి ఉత్తేజ్‌, శివాజీరాజా పోటీ నుంచి తప్పుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ నుంచి ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, జాయింట్‌ సెక్రటరీగా ఉత్తేజ్‌ నామినేషనల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారాణాల వల్లే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తేజ్‌ తెలుస్తోంది.

    Rajendra Prasad

    ఎన్నికకు ముందే రాజేంద్రప్రసాద్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొవడం చర్చనీయాంశం అయింది. రాజేంద్రప్రసాద్‌కు రాజకీయ పరమైన అనుభవం లేనందునే ఇలా జరుగుతోందని, ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలు రాజేంద్రప్రసాద్ ఊహించలేక పోతున్నాడని అంటున్నారు. ఈ పరిణామాలు మా అధ్యక్ష ఎన్నికల్లో వన్ సైడ్ వార్ గా మారిందని అంటున్నారు.

    ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థులు లేక రాజేంద్ర ప్రసాద్ షాక్ తిన్నారు. దీంతో జయసుధ ప్యానెల్ నుండి మంచు లక్ష్మి ఏకగ్రీవం అయ్యారు. అనూ పరిణామాల మధ్య శివాజీ రాజా, ఉత్తేజ్ కూడా బరి నుండి తప్పుకోవడంతో రాజేంద్రప్రసాద్‌ ప్యానెల్‌కు పెద్ద దెబ్బే. ఇప్పటి వరకు తెలుగు సినీ ప్రముఖుల్లో రాజేంద్ర ప్రసాద్ కు చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రమే మద్దతు ప్రకటించారు.

    జయసుధ ప్యానెల్‌కు మాత్రం సినీ ప్రముఖుల నుండి భారీగా మద్దతు ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, నటుడు కృష్ణంరాజు, మోహన్ బాబు లాంటి వారు జయసుధకే మద్దతు పలికారు. జయసుధ ప్యానెల్ ప్రముఖులతో బలంగా కనిపిస్తోంది. ఈ ప్యానెల్ తరుపున తనికెళ్ల భరణి(కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు), అలీ (కార్యదర్శి), పరుచూరి వెంకటేశ్వరావు(కోశాధికారి), నరేష్, రఘు బాబు(సంయుక్త కార్యదర్శులు), చార్మి, ఢిల్లీ రాజేశ్వరి, గీతాంజలి, హేమ, జయలక్ష్మి, నిర్మల, శివ పార్వతి, బెనర్జీ, బ్రహ్మాజీ, హరినాథ్ బాబు, జాకీ, కృష్ణుడు, మహర్షి రాఘవ, నర్సింగ్ యాదవ్, రాజీవ్ కనకాల, శ్రీశశాంక, శ్రీనివాస్ పసునూరి, విద్యాసాగర్(కార్యవర్గ సభ్యులు)గా పోటీలో ఉన్నారు. ఇప్పటికే జయసుధ ప్యానల్ నుండి ఉపాధ్యక్షులుగా శివకృష్ణ, మంచు లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

    English summary
    Actor Rajendra Prasad who is contesting for MAA President had received a severe setback after two of his panel members announced quitting the election. Shivaji who is contesting for Chief Secretary post and Uttej who is in fray for Joint Secretary Post announced their withdrawal. Both of them clarified that t
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X