twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ ఎలక్షన్: నా దౌర్భాగ్యమంటూ రాజేంద్రప్రసాద్ ఆవేదన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘సేవ చేయడానికి మనసు ఉంటే చాలు. మెడల్స్, కొమ్ములు అవసరం లేదు. సంకల్పం ఉంటే బలం వస్తుంది అని నమ్మిన వాల్లలో నేనూ ఒకడిని. మార్పు కావాలని అంతా కోరబట్టే నేను పోటీ చేస్తున్నాను' అని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ‘మా' ఎన్నికల సందర్భంగా జయసుధ ప్యానెల్ తమపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాజేంద్రప్రసాద్ ప్యానెల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

    తనకు స్టేచర్ లేదంటూ మెరళీ మోహన్ చేసిన వ్యాఖ్య్లను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘నాకు స్టేచర్ లేదని అంటున్నారు. అలా చూస్తే నాతో పోటీ చేయడానికి అర్హులు పరిశ్రమలో ఎవరూ లేరు. నేను తెలుగువాడిగా పుట్టిన దౌర్భాగ్యం వల్లే అంతర్జాతీయ సినిమా చేసిన గుర్తింపు రాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

    మా ఎలక్షన్ గురించి మాట్లాడుతూ....ఇది ధర్మ యుద్ధం. హాస్యంతో సినీ కళామతల్లికి సేవ చేశా, ధర్మ యుద్ధంలో మంచి సేవ చేయడానికి రావడమే మేం చేసిన పాపమా, ఓకవేళ నేను పాపం చేసినట్లుగా అయితే ఆ పాపాన్ని మూటకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

    Rajendra Prasad

    సేవ చేసేందుకు మనసు సంకల్పం ఉంటే చాలు, మంచి మార్పు కోసమే పోటీ చేయాలని నిర్ణయించాం. నాతో పోటీ పడగల స్థాయి ఎవరికీ లేదు, సినీ కళాకారుడి జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తాయి, అలాంటి వారి కోసం అసోసియేషన్ పెట్టుకున్నాం, మా అంటే అమ్మ.. దానికి కనీసం భూమి... అంటే నాలుగు రేకులతో కూడిన షెడ్డు కూడా లేదు, కళాకారులు ఉన్న నిలయం పవిత్రంగా గొప్పగా ఉండాలి, అలా ఉండాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఉన్నా...అని వ్యాఖ్యానించారు.

    ఏమండీ మేడం(జయసుధ) మీరంటే నాకు గౌరవం, ఎంపీ గారు(మురళీ మోహన్) మీరంటే గౌరవం, ఇక్కడ ఇలాంటి పగలు ఎందుకు, నేను జీవితాంతం నవ్వించి బతికిన వాణ్ణి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆస్తులు వెంట రావు, పీవీ నర్సింహ రావు వంటి రాజకీయ నాయకుల నుండి రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూపించి ఇంట్లో ఆనందంగా గడిపారు' అని వ్యాఖ్యానించారు.

    మేడం మాజీ ఎమ్మెల్యే, ఆమెను వెనక నుండి నడిపిస్తున్న మహా శక్తి ఎంపీ. సినిమా ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఉందని ఆమె అంటున్నారు. ఆమెకు ఈ స్క్రిప్టు రాసిచ్చింది కూడా పురుషుడే అయి ఉంటాడు. ఆడవాళ్లకు గౌరవం ఉన్న ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ, ఇండస్ట్రీలో పురుషాధిక్యతకు తావు లేదు, సావిత్రి నుండి సహజనటి (జయసుధ) వరకు అందరికీ ఇండస్ట్రీలో గౌరవం లభించింది. అనేక మంది హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేసిన వారిలో నేను ఒకడిని, మాట్లాడు కుంటూ పోతే గంటలుగా మాట్లాడుకుంటూ పోగల నటులలో నేను ఒకడిని, మీకు ప్యానల్ ఉందా అంటే సమాధానం చెప్పవలసిన బాధ్యత నాపైన ఉందా, ఆరేడు వందల మంది కోసం పని చేసేందుకు ఇరవై మంది వరకు కావాలి, ప్యానల్ పేరుతో విభజించి పాలిస్తారా, అల్ రెడీ రాజకీయాలు చేసి కంపు చేశారు, మళ్లీ ఇక్కడ రాజకీయాలా, చెయ్యాలనే మనసు ఉంటే చేయవచ్చు, ఇలా మాట్లాడాల్సిన అవసరం వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నా' అని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించాకు.

    నేను ఎన్నికయితే.. ఐదు కోట్లతో కార్పస్ ఫండ్, పేద కళాకారులకు హెల్త్ ఇన్సురెన్స్ ఫ్రీ, ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి వంద శాతం పింఛన్, వీటన్నింటికి మించి నా నవ్వు అనే అస్త్రంతో అందరి సంతలో దూసుకెళ్లి కూర్చో గలను. నాకు రియల్ ఎస్టేట్ లేదు(మురళీ మోహన్ ను ఉద్దేశించి), ఉంటే ఇచ్చేవాడినేమే, మా ఆసోసియేషన్ కు ఇండియాలో ఎక్కడా లేనంత అందమైన బిల్డింగ్ కట్టిస్తాను. నాకు నవ్వంత కోపం, కోపమంతా సూటి, సూటి అంత పర్ఫెక్షన్.. వీటిని పర్ఫెక్ట్ గా చేయగలిగితే మగాన్ని. నాపై నమ్మకం ఉంటే భగవంతుడి సాక్షిగా వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించండి' అని వ్యాఖ్యానించారు రాజేంద్రప్రసాద్.

    మమ్మల్ని చాలా బాధపెట్టారు. మేము రాజకీయం చేస్తున్నామని అంటున్నారు. తాను నవ్వులు పండించే వాడిని, తనకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను అన్ని విషయాలు సూటిగా చెప్పాను. చివరగా చెబుతున్నా.. పోటీ అంటూ దిగిన తర్వాత వెన్నుచూపే అలవాటు నాకు లేదు, 29న తప్పకుండా నేను నిలబడతా, మీకు కావాలనుకుంటే నాకు ఓటేయండి' అన్నారు.

    English summary
    Politics inside MAA elections are taking huge twists and turns each moment as a nominee, actor-writer Uttej has backed out from President-nominee Rajendra Prasad's panel. Regarding the happenings, finally the senior actor and producer decided to give clarity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X