twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి2 రికార్డును రోబో 2.0 తిరగరాస్తుందట.. రజనీ స్టామినా గురించి తెలుస్తే షాకే..

    భారతీయ సినిమా చరిత్రలో బాక్సాఫీస్ హిస్టరీని తిరుగరాసిన ఘనత బాహుబలి2కి దక్కింది. ఎన్నో ఏళ్ల నుంచి దాటేందుకు కష్టపడుతున్న 1000 కోట్ల క్లబ్‌ను బాహుబలి అవలీలగా దాటేసింది. బాక్సాఫీస్ దుమ్ము దులిపిన దక్షిణ

    By Rajababu
    |

    భారతీయ సినిమా చరిత్రలో బాక్సాఫీస్ హిస్టరీని తిరుగరాసిన ఘనత బాహుబలి2కి దక్కింది. ఎన్నో ఏళ్ల నుంచి దాటేందుకు కష్టపడుతున్న 1000 కోట్ల క్లబ్‌ను బాహుబలి అవలీలగా దాటేసింది. బాక్సాఫీస్ దుమ్ము దులిపిన దక్షిణాది చిత్రంగా బాహుబలి ఓ ఘనతను సాధించింది. బాహుబలి2 సాధించిన రికార్డులు త్వరలోనే సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ కాంబినేషనల్‌లో వస్తున్న రోబో 2.0 చిత్రం అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టుల అంచనాలు అప్పడే మొదలయ్యాయి.

    ప్రపంచవ్యాప్తంగా హవా..

    ప్రపంచవ్యాప్తంగా హవా..

    ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలు ప్రస్తుతం సత్తా చాటుతున్నాయి. హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా కలెక్షన్లు సాధిస్తున్నాయి. దంగల్ చిత్రం రూ.2000 కోట్ల మైలురాయిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా, బాహుబలి2 చిత్రం రూ.1700 కోట్ల మార్కును అధిగమించేందుకు సిద్ధమవుతున్నది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బందోబస్తుగా రికార్డులు క్రియేట్ చేశాయి.

     బాహుబలి రికార్డులు బ్రేక్..

    బాహుబలి రికార్డులు బ్రేక్..

    ఈ రెండు చిత్రాల రికార్డులను రజనీకాంత్ నటిస్తున్న రోబో 2.0 అధిగమించడం ఖాయమనే ఊహాగానాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రం భారత్‌లో గతంలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కానున్నది.

     15 భాషల్లో.. 7000 థియేటర్లలో

    15 భాషల్లో.. 7000 థియేటర్లలో

    తాజా ప్రాథమిక రిపోర్టుల ప్రకారం.. రోబో 2.0 చిత్రాన్ని దేశవ్యాప్తంగా దాదాపు 15 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా భారీగా 7000 థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారనే తాజా సమాచారం. బాహుబలి చిత్రం కేవలం కొన్ని భాషల్లోనే రిలీజ్ కావడం గమనార్హం.

    బాహుబలి బాటలో..

    బాహుబలి బాటలో..

    ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా రిలీజ్ చేయడానికి నిర్మాత ప్రయత్నిస్తున్నారు. బాహుబలి, దంగల్ చిత్రాల మాదిరిగానే పలు దేశాల్లో వివిధ పంపిణీదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిర్మాత పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది.

    రూ.400 కోట్ల బడ్జెట్‌తో..

    రూ.400 కోట్ల బడ్జెట్‌తో..

    రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నది. ఈ చిత్రం రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్నది. ఈ చిత్రంలో పెద్ద మొత్తంలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ఎఫెక్టులు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.

    English summary
    As per latest updates, the Robo 2.0 film will release in 15 languages across 7000 screens in India. Now that's a record that's hard to reach! In fact, even Baahubali 2 wasn't released in as many languages as 2.0 will be. It's quite apparent that 2.0 has managed to beat Baahubali 2 at this level.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X