twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కబాలిని చాలానే కత్తిరించారట...రజినీ సినిమా రన్ టైమ్ కుదింపు

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ఇక ఎంత మాత్రం వాయిదా పడదు. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలలోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సినిమాకు సంబంధించి ఇన్నాళ్లు అడ్డుగా ఉన్న ఓ డీల్ సాకారం అవ్వడంతో విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

    ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ... కబాలి ఉత్తర భారత హక్కుల్ని పొందింది. కేవలం బాలీవుడ్ రిలీజ్ తో పాటు... ఓవర్సీస్ విడుదల హక్కులు సైతం ఈ సంస్థకే దక్కాయి. ఈ డీల్ వర్కవుట్ అవ్వలేదు కాబట్టే ఇన్నాళ్లూ కబాలి విడుదల జరగలేదు. తాజాగా డీల్ సాకారం అవ్వడంతో సినిమా ఈనెల 15 లేదా 22న విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    మరోవైపు బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది. అన్ని ఏరియాల్లోనూ రికార్డు రేట్లే కావడం విశేషం. "కబాలి" రావడానికి కనీసం ఇంకో మూడు వారాలైనా సమయం ఉంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్న ప్రతి ఏరియాలోనూ.. ప్రతి భాషలోనూ బిజినెస్ క్లోజ్ అయిపోవడం విశేషం.

    kabali

    స్టార్ ఇండియాతో కలిసి ఫాక్స్ ఏర్పాటు చేసిన "ఫాక్స్ స్టార్ ఇండియా" కబాలి సినిమా ఉత్తర భారత హక్కులన్నీ సొంతం చేసుకుంది. "కబాలి" హిందీ వెర్షన్‌తో పాటు.. తెలుగు, తమిళ వెర్షన్లను నార్త్ ఇండియా అంతటా ఈ సంస్థే రిలీజ్ చేయనుంది. మరోవైపు "కబాలి" హిందీ శాటిలైట్ హక్కులు కూడా అప్పుడే అమ్ముడైపోవడం విశేషం. స్టార్ టీవీ ఈ హక్కుల్ని రికార్డు రేటుకు సొంతం చేసుకుంది.

    సౌత్ సినిమాల్లో దేనికీ లేని స్థాయిలో "కబాలి"కి నార్త్ ఇండియాలో బిజినెస్ జరగడం విశేషం. ఐతే "కబాలి" రిలీజ్ డేట్ ఏంటన్నది ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే లేదు. జులై 15న అయితే సినిమా విడుదల కాదన్నది ఖాయం. తర్వాతి వారం లేదంటే ఆగస్టు 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాలుగు భాషల్లో డబ్బింగ్ కార్యక్రమాలు చేయాల్సి రావడమే ఈ ఆలస్యానికి కారణం.

    ఒకప్పుడు సినిమా రన్‌టైం గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ.. ఇప్పుడు వీటిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. వీలైనంత వరకు నిడివి తక్కువగానే ఉండేలా దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. 2:10-2:35 గంటల మధ్య నిడివి వుండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ రన్‌టైం ఉండడం వల్ల ఆడియెన్స్ బోర్‌గా ఫీల్ అవుతున్నారనే ఉద్దేశంతో.. స్టార్ హీరోల సినిమాలను సైతం కుదించేస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ "కబాలి" రన్‌టైంని కూడా.. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు లాక్ చేశారని సమాచారం.

    ఇప్పటికైతే మూవీ రన్‌టైం 2:32 గంటలు (152 నిముషాలు) ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే సెన్సార్ సర్టిఫికేషన్ కోసం బోర్డుకు పంపేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. సాధారణంగా రజనీ సినిమాలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిడివితో వచ్చేవి. "కొచ్చాడయాన్", "లింగా" సినిమాల రన్‌టైం కూడా దాదాపు అంతే ఉన్నాయి. ఆ సినిమాలు ఫ్లాప్ కావడానికి రన్‌టైం కూడా కారణమేనని ఆమధ్య కామెంట్లు వచ్చాయి. అందుకే.. "కబాలి" రన్‌టైం విషయంలో మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుని 2:32 గంటలకు కుదించినట్లు తెలిసింది.

    English summary
    Rajinikanth's film run time locked... Sources say that the makers have locked the run time of the movie to 2 hours and 32 minutes, and the film is to be examined by the Censor Board in days time. Kabali is expected to release in over 3000 screens worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X