twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజినీకాంత్ పై తిరుగుబాటు, సొంత స్కూల్ లోనే, నోట్లరద్దుని సమర్థించారు సరే మా సంగతేమిటీ??

    నోట్ల రద్దు నేపథ్యంలో తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ., రజనీకాంత్‌ భార్య లత స్వచ్ఛంద పాఠశాల పాఠశాలకు చెందిన డ్రైవర్లు ఆందోళనకు దిగారు

    |

    పెద్దనోట్ల రద్దుతో సామాన్యులే కాదు ఏకంగా దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబం కూడా కష్టాలు ఎదుర్కొంటున్నది.దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ మరో వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొచ్చాడియాన్ చిత్రానికి సంబంధించి ఆమెపై ఓ వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమం పాఠశాలకు సంబంధించి 28 మంది డ్రైవర్లకు జీతభత్యాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    వారంతా కలిసి పాఠశాల ఆవరణలో ఆందోళన చేయడం చర్చనీయాంశమైంది. రజనీకాంత్‌ భార్య లత చెన్నైలో ఒక స్వచ్ఛంద ఆశ్రమ పాఠశాలను నడిపిస్తున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఈ పాఠశాలకు చెందిన డ్రైవర్లు ఆందోళనకు దిగారు.

    Rajinikanth

    28 మంది వ్యాను డ్రైవర్లు పాఠశాల గేటు ముందు ఆందోళనకు దిగారు. సిబ్బంది కూడా వారి ఆందోళనకు మద్దతు తెలి పారు. తమకు కూడా జీతాలు సరిగా చెల్లించడంలేదని సిబ్బంది ఆరోపించారు. 'ఒకపక్క తుఫాను దెబ్బతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాకు, జీతాలు కూడా సమయానికి చెల్లించకపోతే ఇల్లు గడవడం ఎట్లా...?' అని వారు ప్రశ్నించారు.

    'యాజమాన్యం మాకు బోనస్‌, ఇంక్రి మెంట్‌ ఇస్తానని వాగ్దానం చేసింది. వాటిని కూడా ఇంత వరకూ అమలు చేయడంలేదు' అని వారు వాపోయారు. సిబ్బంది ఆందోళనపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా... పెద్ద నోట్ల రద్దు కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, అది మనమంచికే అనీ , ఈ వారంలో జీతాలను చెల్లిస్తామని చెప్పారు. 'గత ఆరునెలలుగా జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన వచ్చిన తర్వాత మాకు ఇంతవరకు జీతాలు అందలేదు. మేం ఎలా ఇంటి అద్దెలు చెల్లించాలి. నిత్యావసర వస్తువులు కొనాలి?' అని డ్రైవర్‌ కే మురళీకృష్ణ తెలిపారు.

    అందుకే పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిటనట్టు చెప్పారు. బ్యాంకులకు వరుసగా సెలవులు రావడం, జయలలిత మృతి, వర్దా తుపాన్‌ వంటి కారణాలతోనే జీతాలు ఆలస్యమవుతున్నాయని మేనేజ్‌మెంట్‌ చెప్తోందని, తమ కష్టాల గురించి ఎంతగా విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని డ్రైవర్లు అంటున్నారు.

    English summary
    Superstar Rajinikanth's wife Latha Rajinikanth's school The Ashram has run into trouble over alleged non-payment of wages to its staff. Over 28 drivers working at Chennai-based school staged a protest on Monday over delay in payment of salaries.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X