twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైల్వే స్టేషన్లలో ఇకపై రజనీకాంత్ వాయిస్

    By Bojja Kumar
    |

    చెన్నై: ఇకపై రైల్వే స్టేషన్లలో రజనీకాంత్ వాయిస్ వినబోతున్నాం. ఈ మధ్య రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రాక్ దాటుతూ పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జనాల్లో చైతన్యం తెచ్చేందుకు రజనీకాంత్ వాయిస్ ఉపయోగించాలని రైల్వే డిపార్టుమెంట్ నిర్ణయించింది. ఆయన వాయిస్ వినిపించడం ద్వారా ఎవరూ నేరుగా రైలు పట్టాలు దాటకుండా పాదచారుల వంతెన ఎక్కి వెళ్లేలా చైతన్యం తేనున్నారు.

    రైల్వే పోలీస్ డిపార్టుమెంటులో పని చేసే మిమిక్రి ఆర్టిస్టుతో రజనీకాంత్ వాయిస్ రికార్డు చేసి అన్ని రైల్వే స్టేషన్లలో వేయనున్నారట. ఎక్కువగా స్కూలు, కాలేజీ విద్యార్థుల రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో వారిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచి పనికి తన వాయిస్ ఉపయోగిస్తుండటంతో రజనీకాంత్ కూడా వెంటనే అంగీకరించినట్లు సమాచారం.

    Rajinikanth Voice in Railway Stations

    రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే త్వరలో ‘లింగా' సినిమా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘లింగా' చిత్రం‌లో రజనికి జోడిగా అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కెఎస్. రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత‌గా రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సౌత్ ఇండియాలో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏ.అర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

    ‘లింగా'లో తెలుగు కమెడియన్ బ్రహ్మానందం కూడా సందడి చేయబోతున్నారు. ఆయ‌న‌కు సంబంధించి షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో తెర‌కెక్కించారు. ఇందులో బ్రహ్మానందం ఖాకీ డ్ర‌స్సులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ బ్రహ్మానందం పాత్రను నవ్వులు పూయించేలా డిజైన్ చేసారట. చాన్నాళ్ల త‌ర్వాత బాల‌సు బ్ర‌హ్మణ్యం ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమాకు టైటిల్ సాంగ్ పాడారు.

    English summary
    The latest news is that the railway department has come to a decision to create awareness about the dangers of crossing railway tracks and is especially focusing on school and college students. Railway police employ an artiste who mimics Rajinikanth’s voice to warn people against crossing tracks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X