twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం చేసాడో తెలుసా? రామ్ చరణ్.... నీది నిజంగా చాలా పెద్దమనసు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి వారసత్వాన్ని వందకు వంద శాతం పునికి పుచ్చుకున్నారు. కేవలం ఆయన నుండి నట వారసత్వాన్నే కాకుండా.... ఇతరులకు సహాయం చేసే మంచి గుణాన్ని కూడా అందిపుచ్చుకున్నారు.

    తాజాగా రామ్ చరణ్ ఇద్దరు చిన్నారులకు సహాయం చేసారు. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న ఇద్దరు చిన్నారులకు ఆపరేషన్ కోసం తనవంతు సపోర్టు ఇచ్చారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ నేతృత్వంలో చిన్నారులకు ఆపరేషన్ జరుగగా... రామ్ చరణ్ ఫండింగ్ ఇచ్చినట్లు సమాచారం.

    వారికి వినికిడి శక్తిని ప్రసాధించిన డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ అండ్ టీంకి రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

    రామ్ చరణ్

    రామ్ చరణ్

    నేను చాలా సంతోషపడ్డ రోజు ఇది. ఈ చిన్నారులకు పుట్టుకతోనే వినికిడి సమస్య. కానీ ఇఫ్పుడు మనందరిలా వారూ వినగలరు. సాహి టీం.. డా.ఇ.సి వినయ్ కుమార్ లకు థాంక్స్. మనలో చాలా మందికి వినికిడి సమస్య ఉండదు కాబట్టి దాని విలువ పెద్దగా తెలియదు. కానీ దాని విలువ ఏమిటో ఈ పిల్లల మొహాల్లో ఆనందం చూసిన తర్వాత అర్థమైంది అంటూ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

    సాహి

    సాహి

    సాహి అంటే.. సొసైటీ టు ఎయిడ్ డ హియరింగ్ ఇంపెయిర్డ్ అని అర్ధం. వినికిడి లోపాలు ఉన్నవారిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తూ ఉంటుంది.

    విరాళాలు

    విరాళాలు

    సాహి సంస్థ విరాళాలు సేకరించి వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ నుండి కూడా ఈ సంస్థ విరాళాలు సేకరించి ఇద్దరు చిన్నారులకు ఆపరేషన్ చేయించినట్లు సమాచారం.

    ధృవ

    ధృవ

    రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ `ధృవ`. గీతాఆర్ట్స్ వారు రామ్ చరణ్ తో `మగధీర` తర్వాత చేస్తున్న మూవీ ఇది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌పించ‌నున్నారు. అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. డిసెంబ‌ర్‌లో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

    English summary
    "Such a heart-warming day!! These kids were born hearing impaired, but can now hear like any one of us. Thanks to SAHI Team and DR E C Vinay Kumar. We might take it for granted but now I realize the value of being able to hear normally!" Charan posted on his FB page.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X