twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్...రామ్ చరణ్ కు అనుకున్న టైటిల్ వేరే వాళ్లు పెట్టేసారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ రూపొందుతోన్న చిత్రానికి ఇప్పటివరకూ టైటిల్ ఫైనలైజ్ కాలేదు. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి "బ్రూస్ లీ" అనే టైటిల్ పెట్టే అవకాసముందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఎఆర్ రహమాన్ మేనల్లుడు జివి ప్రకాష్ చిత్రానికి తెలుగు,తమిళ వెర్షన్ లకు గానూ ఈ టైటిల్ ని పెట్టి పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ ఇక్కడ చూడండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిత్రం విశేషాలకు వస్తే...

    రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పైన రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల చేస్తామని మొదట రోజే ప్రకటించారు. అందుకు అణుగుణంగా రెగ్యులర్ షూటింగ్ లో నో గ్యాప్ అన్నట్లు జరుపుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో విడుదల తేదీ గురించి తమన్ ఓ ట్వీట్ చేసారు.

    Ram Charan cannot be Bruce Lee

    తమన్ చెప్తున్న దాని ప్రకారం సెప్టెంబర్ మిడిల్ లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. అంతే కాకుండా ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ రషెస్ మరియు టీం స్పీడ్ చూసిన తమన్ సినిమా చాలా బాగా వస్తోందని తెలిపాడు.

    ప్రస్తుతం రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ...స్టంట్ మ్యాన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాలకు పనిచేసే ఆ స్టంట్ మ్యాన్ తన వృత్తిలో భాగంగా ...అప్పటికే హీరోగా చేస్తున్న బ్రహ్మాజీకి బాడీ డబుల్ గా కనపడి...ఫైట్స్ చేస్తాడన్నమాట. ఈ సీన్స్ ని రీసెంట్ గా శ్రీను వైట్ల చిత్రీకరించారు.

    ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

    Ram Charan cannot be Bruce Lee

    నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

    ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    అలాగే....

    సినిమాలో కథలో భాగంగా.... చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రానికి రామ్‌చరణ్‌ ఫైట్స్‌ కంపోజ్‌ చేస్తూ కనపడతాడు. రామ్‌చరణ్‌తో ఆయన శ్రీనువైట్ల చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్‌పై ఉంది. ఇందులో చిరంజీవి ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది.
    చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరు ఓ 'స్టార్‌' పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన నటించే చిత్రానికి చరణ్‌ ఫైట్‌ మాస్టర్‌గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట.

    ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్‌ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు.

    English summary
    GV Prakash next film is titled as "Bruce Lee" and it has the same title both in Tamil and Telugu. So, there is no chance for Ram Charan to come up with this title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X