twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొలి ప్రయత్నంలోనే రామ్ చరణ్‌‌కు రూ. 50 కోట్ల లాభం!

    ఖైదీ నెం 150 ప్రాజెక్టు ద్వారా రామ్ చరణ్ కు ఓవరాల్‌గా రూ. 50 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్లార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ఖైదీ నెం 150' చిత్రం బాక్సాపీసు వద్ద సంచలన విజయం సాదించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా మెగాతనయుడు రామ్ చరణ్ నిర్మాతగా మారాడు. తొలి సినిమా కావడం, అది కూడా తండ్రితో చేస్తున్న సినిమా కావడంతో ఏ మాత్రం రాజీ పడకుండా సినిమా తీసారు. సూపర్ హిట్ కొట్టాడు.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా రామ్ చరణ్ కు ఓవరాల్‌గా రూ. 50 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లాభంలో రూ. 12 కోట్లు థియేట్రికల్ రైట్స్ ద్వారా రాబట్టుకున్నారట. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మాటీవీ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

    అందుకే రెండో సినిమా కూడా నాన్నతోనే

    అందుకే రెండో సినిమా కూడా నాన్నతోనే

    తొలి చిత్రానికి భారీ లాభాలు రావడంతో రెండో సినిమా కూడా నాన్నతోనే చేయాలని డిసైడ్ అయ్యాడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న ఈచిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని, ఊయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

    ఖైదీ నెం 150

    ఖైదీ నెం 150

    ఖైదీ నెం 150 చిత్రం 164 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అందులో 104 కోట్లు షేర్ వచ్చింది. దాంతో వంద కోట్లు దాటిన రెండో చిత్రంగా ఈ సినిమా రికార్డ్ చేసింది. సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై ఇంత భారీ మొత్తంలో గ్రాస్ సాధించిన తొలి సౌతిండియా ఫిల్మ్ ఇదే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

    పవన్ సినిమా కంటే తక్కువే

    పవన్ సినిమా కంటే తక్కువే

    శాటిలైట్ రైట్స్ విషయంలో ‘ఖైదీ నెం 150' కంటే ... పవన్ క‌ళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు'కే ఎక్కువ ధర పలికింది. ఖైదీ నెం 150 చిత్రానికి రూ. 12 కోట్లు రాగా, కాటమరాయుడు చిత్రానికి రూ. 12.5 కోట్లు వచ్చినట్లు సమాచారం.

    మౌనం వీడిన బండ్ల గణేష్: పవన్, ఎన్టీఆర్, బినామీ.... ఇంకా ఎన్నో చెప్పాడు!

    మౌనం వీడిన బండ్ల గణేష్: పవన్, ఎన్టీఆర్, బినామీ.... ఇంకా ఎన్నో చెప్పాడు!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    'Khaidi No.150' stood as the second biggest grosser ever in the history of Telugu Cinema. It collected a Gross of 164 crore and Share of Rs 104 crore in its full run. Ram Charan earned a profit of anywhere around Rs 50 crore for his maiden production itself. That's the reason Cherry decided to produce even 151st flick of Megastar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X