twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోవిందుడు షో: మెగా ఫ్యాన్స్ ఆందోళన, పోలీసుల ఎంట్రీ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అభిమానుల కోసం వివిధ ప్రాంతాల్లో ఉదయం 5.18 గంటలకే బెనిఫిట్ షోలు ఏర్పాటు చేసారు. అయితే హైదరాబాద్ కూకటపల్లిలోని విశ్వనాథ్ 70 ఎంఎం థియేటర్లో గంధరగోళ పరిస్థితి నెలకొంది.

    ఉదయం 5.18కి షో ప్రారంభం కావాల్సి ఉండగా....శాటిలైట్ టెక్నికల్ సమస్య కారణంగా ఆలస్యంగా ఉదయం 6 గంటల తర్వాత షో మొదలైంది. ఫస్టాఫ్ ముగిసే వరకు ఉదయం 7.30 గంటలయింది. అయితే మళ్లీ టెక్నికల్ సమస్య రావడంతో సెకండాఫ్ దాదాపు గంటన్నర ఆలస్యంగా 9 గంటలకు ప్రారంభమైంది.

     Ram charan fans protest at Vishwanath Theatre

    ఈ గ్యాపులో మెగాఫ్యాన్స్ థియేటర్లో ఆందోళనకు దిగారు. ప్రొజెక్టర్ రూంలోకి చొచ్చుకెళ్లారు. వెంటనే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన కొందరు పోలీసులు థియేటర్లోకి వచ్చి ప్రొజెక్టర్ రూంలోకి చొచ్చుకెళ్లిన వారిని బయటకు పంపారు. పోలీసుల భద్రత మధ్య సమస్య సరిచేసారు. 9 గంటలకు షో ప్రారంభం కావడంతో అంతా సద్దు మనిగింది.

    ఒక్కో టిక్కెట్ 700పైనే...
    తొలి రోజు, తొలి షో చూడాలనే అభిమానుల వీక్ నెస్ ఆసరాగా చేసుకుని షో నిర్వాహకులు ఒక్కో టికెట్ రూ. 700 నుండి 800 వందల వరుకు బ్లాక్ లో అమ్మడం గమనార్హం. స్పెషల్ మార్నింగ్ షో పేరుతో ప్రత్యేకంగా టిక్కెట్లు ముద్రించారు. ఆ టిక్కెట్లపై రేటు ముద్రించి లేక పోవడంతో ఇష్టం వచ్చిన రేటుకు బ్లాక్ లో అమ్మారు. ఇంత రేటు పెట్టి......ఆలస్యంగా సినిమా చూడటంపై పలువురు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసారు.

    English summary
    Ram charan fans protest at Vishwanath Theatre, Kukatpally, Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X