»   » షారుక్ కోసం ఫాం హౌస్‌లో రామ్ చరణ్ పార్టీ (ఫోటోస్)

షారుక్ కోసం ఫాం హౌస్‌లో రామ్ చరణ్ పార్టీ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవ్వడం, ప్రమోషన్స్ కూడా ముగియడంతో రామ్ చరణ్ కాస్త ఫ్రీ అయ్యారు. తన ఖాళీ సమయాన్ని పార్టీలతో గడుపుతున్నాడు. తాజాగా రామ్ చరణ్ ఓ పార్టీ ఇచ్చారు. షారుక్ ఖాన్, దిల్ వాలె టీం కోసం నిన్న రాత్రి పార్టీ ఏర్పాటు చేసాడు. రామ్ చరణ్, షారుక్ తో పాటు బోమన్ ఇరానీ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతోంది.

షారుక్ నటిస్తున్న ‘దిల్ వాలె' మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. షూటింగ్ గ్యాపులో షారుక్ ఇక్కడి తెలుగు ఇండస్ట్రీలోని తన ఫ్రెండ్స్ ను కలుస్తున్నారు. ఇటీవల ఆయన మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం' సెట్స్ ను విజిట్ చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా షూటింగ్ సమయంలోనూ షారుక్ అక్కికి వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేసారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్... షారుక్, దిల్ వాలె టీంను తన ఫాం హౌస్ కి పిలిచి స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, రానా దగ్గుబాటి, మరికొందరు ఫ్రెండ్స్ పాల్గొన్నారు.

షారుక్
  

షారుక్

షారుక్ ఖాన్, బోమన్ ఇరానీ, రామ్ చరణ్ కలిసి లాస్ట్ నైట్ పార్టీలో ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.

వరుణ్ ధావన్
  

వరుణ్ ధావన్

వరుణ్ ధావన్ ఇటీవల బ్రూస్ లీ సెట్స్ కు వచ్చిన సమయంలో ఇద్దరూ కలిసి భోజనం చేసారు.

బ్రూస్ లీ
  

బ్రూస్ లీ

బ్రూస్ లీ షూటింగ్ సమయంలో షారుక్ ఖాన్ వచ్చి విజిట్ చేసిన దృశ్యం.

రామ్ చరణ్
  

రామ్ చరణ్

బ్రూస్ లీ సెట్స్ లో షారుక్ ఖాన్ సందడి.

 

 

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos