»   » మెగా వేడుకలకు సన్నాహాలు: ఫ్యాన్స్‌ని కలిసిన రామ్ చరణ్ (ఫోటోస్)

మెగా వేడుకలకు సన్నాహాలు: ఫ్యాన్స్‌ని కలిసిన రామ్ చరణ్ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లోని అభిమానులను కలిసారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలు మెగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న చరణ్ వారిని అభినందించాడు.

అయితే రామ్ చరణ్ అభిమానులను మీటవ్వడం వెనక అసలు కారణం వచ్చే నెలలో జరుగబోయే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల గురించిన సన్నాహాల గురించే అని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టినరోజు వేడుకలు గతంలో కంటే గ్రాండ్ గా జరుపాలనే యోచనలో రామ్ చరణ్ ఉన్నారు.

మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల ద్వారా ఆయన 150వ సినిమాకు భారీ పబ్లిసిటీ తేవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రామ్ చరణ్ స్వయంగా అభిమాన సంఘాల నాయకులను కలిసి ఈ మేరకు వారికి దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కేవలం ఒకే రోజులో ముగించకుండా వారోత్సవాల పేరుతో వారం లేదా 9 రోజుల పాటు వివిధ సేవాకార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో రక్తదానం, అన్నదానం, పేదలకు వస్త్రదానం, రోగులకు పాలు పండ్లు దానం, విద్యార్థులకు పుస్తకాలు అందించడం లాంటివి చేస్తారట.

రామ్ చరణ్

చిరంజీవి 150వ సినిమాకు రామ్ చరణే నిర్మాత. అందుకే పుట్టినరోజు వేడుకలపై ప్రత్యేర దృష్టి పెట్టినట్లు సమాచారం.

వివి వినాయక్

చిరంజీవి చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

కత్తి రీమేక్

తమిళంలో సూపర్ హిట్టయిన కత్తి చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

కత్తిలాంటోడు

ఈ చిత్రానికి కత్తిలాంటోడు అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

షూటింగ్

ఇటీవలే చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది.

లుక్ అదిరింది

150వ సినిమా షూటింగ్ లొకేషన్ కు సంబంధించిన లుక్ ఇటీవల విడుదల చేసారు. ఇందులో చిరంజీవి లుక్ సూపర్బ్ గా ఉంది.

వచ్చే సమ్మర్

వచ్చే సమ్మర్లో చిరంజీవి 150వ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Ram Charan kept his promise and visited fans from Guntur, Krishna and Prakasam district and appreciated the great work done by them.
Please Wait while comments are loading...