twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవును... ‘గోవిందుడుకి...’ ప్రేరణ ఆ సినిమానే...

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ సినిమాపై ‘సీతారామయ్యగారి మనవరాలు' ఇన్‌స్పిరేషన్‌ ఉంది. అయితే పూర్తిగా కాదు. దీని కథ వేరే. స్ర్కీన్‌ప్లే వేరే అంటున్నారు రామ్ చరణ్. ఆయన తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలే రేపు అనగా బుధవారం విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈ చిత్రం కథ...సీతారామయ్యగారి మనమరాలు కి మేల్ వెర్షన్ లా ఉంటుదన్న వాదనని కొట్టిపారేసారు.

    అందిన సమాచారం ప్రకారం...ఈ చిత్రం కథేమిటంటే.... ఈ చిత్రంలో ప్రకాష్ రాజు పెద్ద మోతుబరి రైతు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఒకడు రహమాన్. రెండవ వాడు శ్రీకాంత్. మొదటి నుంచి శ్రీకాంత్ ...తండ్రి మాట వినకుండా..తిరుగుతూంటే అతన్ని ప్రక్కన పెడతాడు. ఇక పెద్ద కొడుకు రహమాన్ విషయానికి అతన్ని డాక్టర్ చదివిస్తాడు. డాక్టర్ చదివి తన చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి ఉచిత వైద్యం చేస్తాడని భావిస్తాడు.

    అయితే డాక్టర్ చదివిన రహమాన్ తను ఇష్టపడ్డ అమ్మాయిని ప్రేమించి లండన్ వెళ్లి అక్కడ డాక్టర్ ప్రాక్టీస్ పెడతాడు. వారి కుమారుడే రామ్ చరణ్. అతను లండన్ లో పెరిగి పెద్దై తన తాత గురించి తెలుసుకుని ఇండియా వస్తాడు. అయితే తనే ఆయన మనవడుని అని చెప్తే ఒప్పుకోడని తన ఐడింటెటీ దాచి ఆయనకు దగ్గర అవుతాడు. అంతేకాకుండా తన బాబాయ్ ని సైతం తన తాతకు దగ్గరయ్యేలా చేస్తాడు.

    Ram Charan's Govindudu Andari Vaadele movie inspired from...

    తన బాబాయ్ శ్రీకాంత్ ప్రేమించిన కమలిని ముఖర్జీ ని దగ్గర చేసి మార్కులు కొట్టేస్తాడు. తర్వాత తన తాతను, తన తండ్రిని, బాబాయ్ ని కలుపుతాడు. ఈ లోగా లోకల్ గా కొందరు తన తాతకు శత్రువులు ఉంటే పనిలో పనిగా వారి పనీ పడతాడు. అక్కడ తన మేనమామ కూతురు కాజల్ తో డ్యూయిట్స్ పాడతాడు. ఇలా తన కుటుంబానికి ఓ ఎన్నారై ఎలా దగ్గరయ్యాడనే విషయం చుట్టూ సినిమా తిరుగుతుంది.

    రామ్ చరణ్ దర్శకుడు గురించి మాట్లాడుతూ... ఒక్కసారి వంశీతో సింక్‌ అయితే ఆయనతో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో మన పర్ఫార్మెన్స్‌ను కొత్త కోణం లో చూస్తాం. ఆయన తీసినవాటిలో ‘నిన్నే పెళ్లాడుతా', ‘మురారి', ‘చందమామ' వంటివి బాగా ఇష్టం. అయితే ఈ కథ వాటికి భిన్నం. ఓ సీన్‌ అనుకున్న తర్వాత, స్పాట్‌లో ఇలా కూడా చేయొచ్చని, దాన్ని ఇంకో రకంగా చెపుతారు వంశీ. అలాంటి సందర్భాలు ఈ సినిమాలో నాకు బోలెడున్నాయి. మనం డబ్బింగ్‌ చెప్పే తీరుతో సినిమా తీరును మార్చవచ్చని, ఈ సినిమాకి డబ్బింగ్‌ చెప్పేప్పుడు తెలుసుకున్నా అన్నారు.

    English summary
    Ram Charan Said that Govindudu Andari Vaadele story is inspired from Seetha Ramayya Gari Manama Raalu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X