twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హుధూద్: రామ్ చరణ్ 10+5 లక్షల సాయం, ఫ్యాన్స్‌కి పిలుపు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హుధూద్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సహాయ కార్యక్రమాల కోసం సినీ నటుడు రామ్ చరణ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. దీంతో పాటు వైజాగ్ లోని రామకృష్ణ మిషన్‌కు 5 లక్షల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు. దీంతో పాటు 5 వేల పులిహోర ప్యాకెట్లు, 5 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 5 వేల వాటర్ బాటిల్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ఒక జిల్లాను దత్తత తీసుకుని సహాయ కార్యక్రమాలు చేస్తానని రామ్ చరణ్ ప్రకటించారు.

    విలయంపై చరణ్ మాట్లాడుతూ...ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు మనం చేసేది ఏమీ ఉండదు...ముందు జాగ్రత్త చర్యలు తప్ప. టెక్నాలజీ, మీడియా సహకారం వల్ల నష్టం చాలా దగ్గింది, మీడియా ద్వారా అందరినీ అప్రమత్తం చేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

    Ram Charan's helping hand to Hudhud Cyclone Victims

    తుఫాన్ సమయంలో పరిస్థితిని తెలుసుకోవడానికి అభిమానులతో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ పాడవ్వటం వల్ల ఏ ఒక్కరితోనూ మాట్లాడలేక పోయాను. ఈ ప్రాంతంలోని ప్రజలు, అభిమానులు మమ్మల్ని ఎంతగానో అభిమానించారు. ఈ ప్రాంతం నుండి మంచి కలెక్షన్లు వచ్చాయి. వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సహాయం చేస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.

    తుఫాన్ ప్రభావ ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో అభిమానులు పాలుపంచుకోవాలని రామ్ చరణ్ పిలుపు ఇచ్చారు. త్వరలోనే పాత వైజాగ్ చూస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. నేను వెళ్లడం కన్నా....వాటర్, ఆహారం వెళ్లడం ముఖ్యం. గవర్నమెంటు చాలా బాగా రియాక్ట్ అయిందని...రామ్ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    English summary
    Ram Charan's helping hand to Hudhud Cyclone Victims.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X