»   » ధృవ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్: రామ్ చరణ్ ఏమన్నారంటే... (ఫొటోలు)

ధృవ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్: రామ్ చరణ్ ఏమన్నారంటే... (ఫొటోలు)

ధ్రువ ప్రీరిలీజింగ్ ఫంక్షన్‌లో ఆదివారం సాయంత్రం రామ్ చరణ్ తేజ ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే...

Posted by:
Subscribe to Filmibeat Telugu

తాను హీరోగా నటించిన ధ్రువ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్‌లో ఆదివారం సాయంత్రం రామ్ చరణ్ తేజ హార్ట్ టచింగ్‌గా మాట్లాడారు. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అంటుంటారని, కానీ తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం అందిస్తే చాలు అని ఆయన అన్నారు.

పేరు, డబ్బు, గౌరవం, అభిమానం ఇలా చాలా చాలా తిరిగి ఇస్తారని ఆయన అన్నారు. ఇలాంటి పరిశ్రమలో తాను ఉన్నందుకు ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు రామ్‌ చరణ్‌. ధ్రువ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించారు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌, ఎన్వీప్రసాద్‌ నిర్మించారు.


Photos : చెర్రీ ధృవ పంక్షన్‌లో కెటిఆర్, గంటా


'ధృవ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చరణ్‌ మాట్లాడారు. ''గీతా ఆర్ట్స్‌ సంస్థలో 'మగధీర' తరవాత సినిమా చేయలేదని, అలాంటి కథ మళ్లీ తనకు 'ధృవ'తో దొరికిందని అన్నారు.


సురేందర్ రెడ్డితో చాలా ట్రావెల్ చేశా..

సురేందర్‌ రెడ్డిగారితో చాలా ట్రావెల్‌ చేశానని, ఏ దర్శకుడికీ రీమేక్‌ చేయాలని ఉండదని, తమ సొంత కథ చేయాలని ఉంటుందని రామ్ చరణ్ అన్నారు. ఈ కథ ఒప్పుకొన్నందుకు ఆయనకు థ్యాంక్స్‌ చెప్పారు. తమిళ సినిమా కంటే బాగా తీశారు.


నేను గెస్ట్... పాట రకుల్ ప్రీత్ సింగ్‌దే..

‘పరేషాన్‌' పాటలో తాను గెస్ట్‌ మాత్రమేనని, ఆ పాట రకుల్‌ప్రీత్‌ సింగ్‌దే అని రామ్ చరణ్ తేజ అన్నారు. అన్ని సినిమాలూ కష్టపడే చేస్తామని, దేన్నీ తేలిగ్గా తీసుకోమని, అభిమానుల్ని అలరించడానికి కష్టపడతామని ఆయన చెప్పారు.


ఈ సినిమాలో కొత్తగా కష్టపడిందేం లేదు..

ధృవ సినిమా కోసం కొత్తగా ఏం కష్టపడలేదని రామ్ చరణ్ అన్నారు. ఇలా కష్టపడకపోకపోతే తప్పు చేసినట్టు అని అన్నారు. ఇది వరకు కాస్త అటూ ఇటుగా ఉన్నా ఫర్వాలేదని అన్నారు. కానీ నాన్నగారు బెత్తం పట్టుకొని నడిపించడానికి మళ్లీ వస్తున్నారని అన్నారు. ఆయన వస్తున్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలని రామ్ చరణ్ అన్నారు.


ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల

ఈ నెల 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని రామ్ చరణ్ చెప్పారు. అదే రోజున థియేటర్లో ‘ఖైది నంబర్‌ 150' టీజర్‌ కూడా చూపించాలనుకొంటున్నామని అన్నారు. ఈ పంక్షన్‌కు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎపి మంత్రి గంటా శ్రీనివాస రావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పాల్గొన్నారు.


English summary
In his Dhruva movie pre releasing function, her0 Ram Charan Teja mead an emotional speech.
Please Wait while comments are loading...