twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ బోర్డు రద్దు చేస్తే వర్మ చెలరేగిపోడూ..!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత కాలంలో చేతిలో మొబైల్ ఫోన్ ద్వారా ఏది కావాలన్నా లభిస్తోంది. సినిమాల్లో వచ్చే సీన్లను సెన్సార్ బోర్డు వారు కట్ చేసినా అవి ఇంటర్నెట్లో లభిస్తున్నాయి. పోర్న్ సైట్లు కూడా అరచేతిలో లభిస్తున్నాయి. అందు వల్ల సెన్సార్ వ్యవస్థ ఉండటం దండగ అని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయ పడ్డారు.

    నలుగురైదుగురు కూర్చుని దేశం మొత్తం ఏం చూడాలి....ఏం చూడకూడదు అనే నిర్ణయాలు తీసుకోవడం అసంబంధంగా ఉందని, మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నామన్న విషయం ఎవరూ మరిచిపోవద్దని వర్మ చెప్పుకొచ్చారు. టైమ్స్ లిట్ ఫెస్టివల్ సందర్భంగా వర్మ ఈ వ్యాఖ్యలు చేసారు.

    Ram Gopal Varma demands ban of the censor board totally

    ఇటీవల విడుదలైన జేమ్స్ బాండ్ మూవీలో సెన్సార్ బోర్డు ముద్దు సన్నివేశాన్ని కుదించడాన్ని, దానిపై విమర్శలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తారు. సెన్సార్ బోర్డు ఆ సీన్ కుదిరించినా...ఇంటర్నెట్లో అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు. సెన్సార్ బోర్డ్ చీఫ్ నిహ్లానీని తాను తప్పుబట్టడం లేదని, నిబంధనల మేరకే ఆయన నడుచుకున్నాడని తెలిపారు.

    సెన్సార్ వ్యవస్థ ఉండటం అవసరం లేదు అనేది తన అభిప్రాయం అని వర్మ చెప్పుకొచ్చారు. అయితే వర్మ ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్తే కాదు. ఈ మధ్య ఆయన తీసిన కొన్ని సినిమాల్లో హింస, అసభ్యత ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. మరి సెన్సార్ బోర్డు లేకుంటే వర్మ ఏ రేంజిలో రెచ్చిపోతారో?

    English summary
    Ram Gopal Varma said that with increasing dependence on Internet for all information there is no need for the censor board. He demanded for a ban of the censor board totally. Varma finds it ridiculous that four-people board deciding on what the entire country should see or download.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X